80 ఏళ్ల క్రితం నాటి మందిరాన్ని పునరుద్ధరించేందుకు ముస్లింలు ముందుకొచ్చారు. రెండున్నర దశాబ్దాలుగా మూతబడిన ఆలయాన్ని పునఃప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. పుల్వామా ఉగ్రదాడి జరిగిన ప్రదేశం నుంచి 12 కిలోమీటర్ల దూరంలోనే ఈ మందిరం ఉండటం విశేషం. ఉగ్రదాడి నేపథ్యంలో తమ మధ్య ఎలాంటి విద్వేషాలు లేవని చాటి చెప్పాలనుకున్నారు ఇక్కడి ప్రజలు.
ఈ ప్రాంతంలో సుమారు 40 కశ్మీరీ పండిత కుటుంబాలు నివసించేవి. 1990వ దశకంలో పుల్వామాలో ఉగ్రవాద చర్యలు తీవ్రమవడం వల్ల వారు వలసవెళ్లారు. అప్పటినుంచి ఈ మందిరం నిరుపయోగంగానే ఉంది. ప్రజల్లో మార్పు రావాలనే ఆశయంతో మసీదుల్లో చేసినట్టే మందిరంలోనూ ప్రార్థనలు చేస్తే బాగుంటుందని ఆలోచించారు. ఫలితంగా ఈ మందిరాన్ని బాగుచేయాలని నిర్ణయం తీసుకున్నాయి ముస్లిం కుటుంబాలు.

అనుకున్నదే తడవుగా మరో పండిత కుటుంబం సహాయంతో పనులు మొదలుపెట్టారు. దీనికి పూర్తి ఖర్చు స్థానిక ముస్లిం ట్రస్ట్ నుంచే అందిస్తున్నారు. అంతేకాకుండా ముస్లిం యువకులు స్వచ్ఛందంగా దీని కోసం పని చేస్తున్నారు.
ఇదీ చూడండి: హిజ్బుల్కు మరో దెబ్బ