తూర్పు లద్దాఖ్‌లో చైనాతో సరిహద్దు ఘర్షణ కొనసాగుతున్న వేళ ఆయుధ, మందుగుండు నిల్వల సామర్థ్యం పెంచుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యుద్ధ సమయాల్లో ఉపయోగించుకునేందుకు ప్రస్తుతం ఉన్న 10 రోజుల నిల్వ సామర్ధ్యాన్ని 15 రోజులకు పెంచాలని నిర్ణయించింది. ఇందుకోసం భద్రతా బలగాలకు ఇటీవలే అనుమతి ఇచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
రూ.50 వేల కోట్లతో..
యుద్ధ సమయాల్లో మరో ఐదు రోజుల ఆయుధ, మండుగుండు నిల్వల సామర్థ్యం పెంచుకునేందుకు భద్రతా బలగాలు దేశీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి వాటిని కొనుగోలు చేయనుంది. ఇందుకోసం రూ.50వేల కోట్లు వెచ్చించనుంది.
యుద్ధ సమయాల్లో 40 రోజులకు సరిపడే ఆయుధ, మందుగుండు సామగ్రి ఉండేందుకు గతంలో కేంద్రం అనుమతి ఉండేది. అయితే వాటి కొరత సహా యుద్ధం చేసే తీరు మారిన నేపథ్యంలో దాన్ని 10 రోజులకు పరిమితం చేసింది. తాజాగా దాన్ని 15 రోజులకు పెంచింది.
ఇదీ చూడండి:భావితరాలకు దిశానిర్దేశం-‘శాస్త్రీయ సామాజిక బాధ్యత