ETV Bharat / bharat

మానవాభివృద్ధి సూచీలో మరోస్థానం కోల్పోయిన భారత్​ - మానవాభివృద్ధి సూచీలో 131వ స్థానానికి భారత్​

మానవాభివృద్ధి సూచీ-2020లో భారత్​ ఒకస్థానాన్ని కోల్పోయి 131కి చేరుకుంది. 189 దేశాలతో కూడిన నివేదికను విడుదల చేసింది ఐరాస అభివృద్ధి కార్యక్రమం (యూఎన్​డీపీ). ఈ సూచీలో మొదటి స్థానంలో నార్వే కొనసాగుతోంది.

UNDP Index 2020
మానవాభివృద్ధి సూచీ
author img

By

Published : Dec 16, 2020, 10:18 PM IST

ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్​డీపీ) విడుదల చేసిన.. 2020 నివేదిక ప్రకారం మానవాభివృద్ధి సూచీలో భారత్‌.. 131వ స్థానానికి పడిపోయింది. మెుత్తం 189 దేశాలతో కూడీన నివేదికను విడుదల చేసిన యూన్‌డీపీ. ఈ ఏడాది భారత్‌ గతంలో కంటే.. ఒకస్థానం దిగజారినట్లు పేర్కొంది.

మానవ అభివృద్ధి సూచీలో ఒక దేశం ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణాల కొలత ఆధారంగా యూన్‌డీపీ ప్రతిఏటా నివేదికను విడుదల చేస్తుంది. 2019 లో భారతీయుల ఆయుర్దాయం 69.7 సంవత్సరాలు కాగా, బంగ్లాదేశ్‌లో ఆయుర్దాయం 72.6 సంవత్సరాలు, పాకిస్తాన్‌లో 67.3 సంవత్సరాలు ఉన్నట్లు 2020 మానవ అభివృద్ధి నివేదిక తెలిపింది.

మానవ అభివృద్ధి సూచీలో మెుదటి స్థానంలో నార్వే ఉండగా.. రెండు, మూడు స్థానాల్లో ఐర్లాండ్‌, స్విజర్లాండ్‌ ఉన్నాయి.

ఈ నివేదికపై మాట్లాడిన యూఎన్‌డీపీ ప్రతినిధి భారత్‌ ర్యాంకు దిగజారడమంటే అక్కడ ప్రమాణాలు కుంటుపడినట్లు కాదు.. ఇతర దేశాలు భారత్‌ కన్నా మెరుగ్గా ఉన్నాయని తెలిపారు. కర్బన ఉద్గారాలను తగ్గించే విషయంలో ఇతర దేశాలకు అన్ని విధాలా భారత్‌ సహాయం చేస్తోందన్నారు. భారతదేశ స్థూల జాతీయ ఆదాయం.. 2019 లో 6,681 డాలర్లకు పడిపోయిందని అన్నారు.

ఇదీ చూడండి: 2022 వరకు 25% మందికి టీకా గగనమే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.