ETV Bharat / bharat

'సంఝౌతా' బోగీని తిరిగి పంపాలని పాక్​ను కోరిన భారత్​ - latest samjhotha express news

వాఘా సరిహద్దు వద్దనున్న సంఝౌతా ఎక్స్​ప్రెస్​ బోగీని పాక్​ తిరిగి పంపించాలని కోరింది భారత్​. ఇప్పటికే ఈ విషయంపై పాక్​కు విజ్ఞప్తి చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. జమ్ముకశ్మీర్​ ప్రత్యేక ప్రతిపత్తి రద్దు తర్వాత ఇరు దేశాల మధ్య రైల్వే సేవలు నిలిచిపోయాయి.

India asks Pakistan to return its rake used in Samjhauta Express
సంజౌతా ఎక్స్​ప్రెస్​ బోగీని తిరిగి పంపించాలని పాక్​ను కోరిన భారత్​
author img

By

Published : Jan 14, 2020, 9:44 PM IST

ఐదునెలలుగా వాఘా సరిహద్దు వద్ద ఉన్న సంఝౌతా ఎక్స్​ప్రెస్​ బోగీని తిరిగి పంపించాలని పాకిస్థాన్​ను కోరింది భారత్​. జమ్ముకశ్మీర్​లో ఆర్టికల్​ 370 రద్దు తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో భారత్​-పాక్​ మధ్య సంఝౌతా ఎక్స్​ ప్రెస్​ సేవలు నిలిచిపోయాయి. విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఈ విషయంపై పాక్​కు విజ్ఞప్తి చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

జమ్ముకశ్మీర్​లో ప్రత్యేక ప్రతిపత్తి రద్దు తర్వాత భద్రతాపరమైన కారణాలు చూపుతూ.. వాఘా సరిహద్దు వద్ద గతేడాది ఆగస్టు 8న సంఝౌతా ఎక్స్​ప్రెస్​ను నిలిపేసింది దాయాది దేశం. ఆ సమయంలో దాదాపు 117 మంది ప్రయాణికులు రైలులో ఉన్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు అటారికి చేరుకోవాల్సిన ఈ రైలు... భారతీయ రైల్వే అధికారులు ఇంజిన్​, సిబ్బందిని పంపిస్తే సాయంత్రం 5.15 గంటలకు వాఘా నుంచి అటారికి చేరుకుంది.

ఆరునెలల ఒప్పందం

సంఝౌతా ఎక్స్​ప్రెస్​ కోసం కోచ్​లను ఉపయోగించేందుకు ఇరు దేశాలు ఓ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. జనవరి నుంచి జూన్​ వరకు పాక్​ రేక్​లను ఉపయోగిస్తే.. జులై నుంచి డిసెంబరు వరకు భారత్​ రేక్​లను ఉపయోగిస్తుంది. సాధారణంగా రేక్​లు ఎప్పటికప్పుడు స్వదేశానికి తిరిగొస్తాయి. కానీ ఐదునెలల వరకు ఓ బోగీ ఇరు దేశాల మధ్య చిక్కుకోవడం ఇదే తొలిసారి.

New Delhi, Jan 14 (ANI): While speaking to ANI in the national capital on January 14, the Minister of Labour and Employment in the Aam Aadmi Party (AAP) government, Gopal Rai spoke on coming Delhi Assembly elections. He said, "The only strategy of AAP is to reach up to maximum masses and connect with the people on one to one basis. People should fight the election for us." "Our motive is to activate the people of Delhi and they should work for the establishment of government," he added. Assembly elections in Delhi are scheduled to be held on February 8.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.