విద్యార్థులకు క్రమశిక్షణ అలవరచడానికి పాఠశాలలోనే క్షౌరం చేయిస్తున్నాడు ఓ ప్రధానోపాధ్యాయుడు. ఆర్థికంగా వెనకబడిన వారికి తన సొంత డబ్బులను వెచ్చిస్తున్నాడు తమిళనాడు కల్లాకురిచి జిల్లా కబిలార్ ప్రభుత్వం బాలుర పాఠశాల ప్రధానోపాధ్యాయుడు.
గతేడాది నవంబర్లో బాధ్యతలు చేపట్టాడు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. తక్షణమే విద్యార్థులు క్రమశిక్షణగా మెలగడం అలవరుచుకోవాలనే దిశగా అనేక చర్యలు తీసుకోవడం ప్రారంభించాడు. అందులో భాగంగానే క్షురకుడిని పాఠశాలకే పిలిపించి మరీ... జుట్టు ఎక్కువుగా ఉన్న విద్యార్థులకు క్షౌరం చేయిస్తున్నాడు.
పాఠశాలలో మొత్తం 800 మంది ఉండగా.. అందులో 120 మంది విద్యార్థులకు ఆయన డబ్బులు చెల్లించాడు. ఈ విషయాన్ని ముందుగానే వారి తల్లిదండ్రులకు తెలిపాడు.
ఇదీ చూడండి : నలుగురు అత్యాచార బాధితుల్లో ఒకరు మైనరే: ఎన్‌సీఆర్‌బీ