హిమాచల్ ప్రదేశ్లోని అత్యంత వ్యూహాత్మక సొరంగ మార్గంగా పరిగణించే రోహ్తంగ్కు ప్రభుత్వం దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయీ పేరు పెట్టనుంది. బుధవారం ఆయన జయంతిని పురస్కరించుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు రక్షణ శాఖ ప్రకటించింది. వాజ్పేయీ ప్రధానిగా ఉన్నప్పుడు 2000, జూన్ మూడోతేదీన రోహ్తంగ్ మార్గం నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో మంగళవారం భేటీ అయిన కేంద్ర మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
ప్రపంచంలోనే పొడవైన సొరంగంగా..
8.8 కిలోమీటర్ల పొడవైన ఈ సొరంగం.. 3వేల మీటర్ల ఎత్తులో ఉన్న ప్రపంచంలోనే పొడవైన సొరంగంగా పేరుగాంచనుంది. ఈ సొరంగ నిర్మాణంతో మనాలి-లేహ్ లద్దాఖ్ మధ్య సుమారు 46 కిలోమీటర్ల మేర దూరం తగ్గనుంది. ప్రస్తుతం సొరంగం పనులు పూర్తికావస్తున్నాయి. ఈ సొరంగం అందుబాటులోకి వచ్చాక అన్ని కాలాల్లో హిమాచల్-లద్దాఖ్ మధ్య రాకపోకలు సాగనున్నాయి. గతంలో శీతాకాలంలో ఆరు నెలల పాటు ఇరు ప్రాంతాల మధ్య రాకపోకలు నిలిచిపోయేవి.
ఇదీ చూడండి: 'ఎన్ఆర్సీ అమలుకు తొలి అడుగే ఎన్పీఅర్'