ETV Bharat / bharat

లష్కరేతో సంబంధమున్న నలుగురు అరెస్టు

author img

By

Published : Jun 24, 2020, 9:23 PM IST

లష్కరే తోయిబా(ఎల్ఈటీ) ఉగ్రవాద సంస్థతో సంబంధమున్న నలుగురు ముష్కరులను జమ్ముకశ్మీర్​ బారాముల్లా జిల్లాలో అరెస్ట్ చేశారు పోలీసులు. సోపోర్​ ప్రాంతంలో పోలీసు పోస్టుపై జరిగిన గ్రనేడ్​ దాడుల్లో వారి హస్తం ఉందని తెలిపారు.

జమ్ముకశ్మీర్​ బారాముల్లా జిల్లాలో లష్కరే తోయిబా(ఎల్​ఈటీ)తో సంబంధమున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు పోలీసులు. సోపోర్​​​ ప్రాంతంలో పోలీసు పోస్టుపై జరిగిన గ్రనేడ్ దాడిలో వారి హస్తం ఉందని తెలిపారు. నిందితులను ఇర్ఫాన్​ అహ్మద్​ మీర్​, ఇర్ఫాన్ అహ్మద్​ ఖాన్​, కైజర్​ రహ్మన్ ఖాన్​, సుహైల్​ అహ్మద్​ గనీలుగా గుర్తించారు పోలీసులు.

పుట్​ఖా పోలీసు పోస్టు వద్ద గ్రనేడ్ లాబీయింగ్​లో కూడా నలుగురు ఉగ్రవాదులు పాల్గొన్నట్టు దర్యాప్తులో తెలిసిందన్నారు అధికారులు. ఎల్​ఈటీ ఉగ్రవాదులకు లాజిస్టిక్​ మద్దతు అందించడం, ఆశ్రయం కల్పించడం సహా ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు. సామాజిక మాధ్యమాల ద్వారా వీరంతా ఉగ్రవాదులతో సంబంధాలు కొనసాగిస్తున్నట్టు చెప్పారు.

ఇదీ చూడండి: కేరళలో కరోనా 2.0- రికార్డుస్థాయిలో కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.