ETV Bharat / bharat

'దిశ'కు న్యాయం కోసం స్వాతి నిరవధిక నిరాహార దీక్ష - దిల్లీ మహిళా కమిషన్​

ఆడవారిపై జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా దిల్లీలోని జంతర్​మంతర్​ వద్ద నిరవధిక నిరాహార దీక్షకు దిగారు దిల్లీ మహిళా కమిషన్​ అధ్యక్షురాలు స్వాతి మాలివాల్​. 'దిశ' కేసు నిందితులను 6 నెలల్లోగా ఉరి తీయాలని డిమాండ్​ చేస్తూ ప్రధాని మోదీకి లేఖ రాసినట్టు తెలిపారు.

dcw-chief-starts-hunger-strike-over-rapes-against-women
మహిళలపై అత్యాచారాలకు నిరసనగా నిరాహార దీక్ష
author img

By

Published : Dec 3, 2019, 3:49 PM IST

Updated : Dec 3, 2019, 5:08 PM IST

'దిశ'కు న్యాయం కోసం స్వాతి నిరవధిక నిరాహార దీక్ష

'దిశ' ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు చెలరేగుతున్న వేళ.. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు నిరసనగా దిల్లీ మహిళా కమిషన్​ అధ్యక్షురాలు స్వాతి మాలివాల్​ జంతర్​మంతర్​ వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. అత్యాచార కేసు నిందితులను 6 నెలల్లోగా శిక్షించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్​ చేశారు.

"రాజస్థాన్​లో ఓ ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగింది. ఆమె కళ్లు కూడా బయటకు వచ్చాయి. హైదరాబాద్​లో ఓ వైద్యురాలిని అత్యాచారం చేసి కాల్చేశారు. చాలా మంది ఇందులో భాగమయ్యారు. ఇప్పుడు ఇలా ఓ ఘటన జరిగింది. తర్వాత ఇంకొకటి, మరొకటి జరుగుతాయి. ఈ దేశంలో ఇంతే. ప్రతిరోజు ఎక్కడో అక్కడ దేశంలోని అనేకమంది ఆడబిడ్డలు చనిపోతున్నారు. వారి మృతదేహాలను చూస్తే మాకు చాలా భయమేస్తుంది. నాతో పాటు దేశం మొత్తం ఎంతో ఆగ్రహంగా ఉంది. నేను నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నా."
-- స్వాతి మాలివాల్​, దిల్లీ మహిళా కమిషన్​ అధ్యక్షురాలు

మోదీకి లేఖ...

మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు వ్యతిరేకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసినట్టు తెలిపారు స్వాతి. నిందితులకు ఆరు నెలల్లో ఉరిశిక్ష విధించాలని డిమాండ్​ చేసినట్టు పేర్కొన్నారు. చట్టాలను రూపొందిస్తే సరిపోదని.. వాటిని అమలు కూడా చేయాలన్నారు. పోలీసు వనరులను పెంచాలని అభ్యర్థించారు.

బాలికలపై జరుగుతున్న అరాచకాలకు నిరసనగా గతంలో 10 రోజులపాటు నిరాహార దీక్ష చేశారు స్వాతి.

అడ్డుకున్న పోలీసులు...?

అంతకు ముందు... దిల్లీలోని జంతర్​మంతర్​ వద్దకు చేరుకున్న వెంటనే పోలీసులు తనను అడ్డుకున్నట్టు ఆరోపించారు డీసీడబ్ల్యూ అధ్యక్షురాలు. అనుమతి లేదంటూ తనను పంపేందుకు ప్రయత్నించారని తెలిపారు. ఓ సాధారణ మహిళను చూసి పోలీసులు, కేంద్రం ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు స్వాతి.

డీసీడబ్ల్యూ అధ్యక్షురాలి ఆరోపణలపై స్పందించారు దిల్లీ పోలీసులు. తాము నిరసనలను అడ్డుకోలేదని స్పష్టం చేశారు. నిరసనలకు గల కారణాలు సహా ఇతర అంశాలపై స్పష్టత కోరుతూ డీసీడబ్ల్యూకి లేఖ రాసినట్టు వివరించారు.

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
FILE: Washington D.C., USA - Date Unknown (CCTV - No access Chinese mainland)
1. National flag of United States
2. White House
3. Capitol Hill, traffic
FILE: New York City, USA - Date Unknown (CCTV - No access Chinese mainland)
4. Various of Nasdaq building at Times Square, pedestrians
FILE: Washington D.C., USA - June 28, 2016 (CGTN - No access Chinese mainland)
5. Various of cars being assembled at Volkswagen workshop
FILE: USA - Exact Location and Date Unknown (CCTV - No access Chinese mainland)
6. Various of workers moving, handling steel parts
FILE: Pennsylvania, USA - Date Unknown (CGTN - No access Chinese mainland)
7. Various of semiconductor manufacturing workshop
FILE: Ohio, USA - Date Unknown (CGTN - No access Chinese mainland)
8. Various of workers at autoglass production works
FILE: Los Angeles, California, USA - Nov 9, 2017 (CCTV - No access Chinese mainland)
9. Various of port, containers
Economic activity in the U.S. manufacturing sector contracted in November, the fourth month in a row, the Institute for Supply Management (ISM) reported Monday.
The Purchasing Managers' Index (PMI) stood at 48.1 percent, a decrease of 0.2 percentage points from the October reading. In September, the index was 47.8 percent, the lowest in a decade. Any reading below 50 percent indicates the manufacturing sector is generally contracting.
The data shows that manufacturing in the United States is still lack of upward momentum due to factors including reduced investment, weak global demand and trade disputes, according to ISM.
Manufacturing industry accounts for about 11 percent in the GDP of the United States.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Dec 3, 2019, 5:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.