అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు ఆయన కుమార్తె ఇవాంక ట్రంప్ కూడా వచ్చే వారం భారత్‌లో పర్యటించనున్నారు. ఈ విషయంపై శ్వేతసౌధం ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ.. ఇవాంక రాక కచ్చితమని అక్కడి అధికారులు చెబుతున్నారు.
ట్రంప్ బృందంలో ఇవాంక భర్త జారెడ్ కుష్నర్ కూడా ఉండనున్నారు. భార్య మెలానియాతో కలిసి ట్రంప్ ఈ నెల 24,25న అహ్మదాబాద్, ఆగ్రా, దిల్లీలో పర్యటించనున్నారు. ఇందుకోసం ఆయా రాష్ట్రాల్లో పనులు శెరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ పర్యటనలో ఇవాంక, కుష్నర్ కూడా తోడవటం వల్ల భారత్‌కు ట్రంప్ సపరివార సమేతంగా వస్తున్నట్టే.
అధికారిక హోదాలో...
ఇవాంక, జారెడ్ ప్రస్తుతం ట్రంప్ ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉన్నారు. ట్రంప్‌కు సీనియర్ సలహాదారులుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఇద్దరూ అధికారిక హోదాలోనే భారత్‌లో పర్యటించనున్నారు. ట్రంప్‌తో కలిసి మోదీతో చర్చల్లో పాల్గొనే ఉన్నతస్థాయి బృందంలో సభ్యులుగా ఉండనున్నారు.
ప్రపంచదేశాల పారిశ్రామికవేత్తల సదస్సు కోసం 2017లో ఇవాంక ట్రంప్ హైదరాబాద్‌లో పర్యటించారు.
ఇదీ చూడండి:- ట్రంప్ మనసులో ఏముంది..? వాణిజ్య ఒప్పందమా? ప్యాకేజీనా?