ప్రపంచ దేశాలతో పాటు భారత్‌ను వణికిస్తోన్న మహమ్మారి కరోనా. ఈ వైరస్‌పై అవగాహన పెంచుతూ.. ఎవ్వరూ కరచాలనం చేయకూడదంటూ అంతర్జాతీయ ప్రఖ్యాత సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ సందేశమిస్తున్నారు .
ప్రధాని నరేంద్ర మోదీ నమస్తే పెడుతున్న చిత్రాన్ని రూపొందించి.. 'నమస్తే పెట్టండి. కరచాలనాన్ని వీడండి' అని సందేశంతో ఒడిశా పూరీ తీరంలో సైకత శిల్పాన్ని రూపొందించారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. కరోనా నింయత్రణకు భారత సంప్రదాయమైన నమస్కారాన్ని అందరూ పాటించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే ప్రపంచదేశాలకు పిలుపునిచ్చారు.