ఈ నెల 26న రాజ్యసభ ఎన్నికలు జరగనున్న వేళ గుజరాత్‌లో కాంగ్రెస్ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. గుజరాత్ స్పీకర్ రాజేంద్ర త్రివేది.. ఈ రాజీనామాలను ఆమోదించినట్లు తెలిపారు. వారి పేర్లను ఇవాళ అసెంబ్లీలో ప్రకటిస్తానని చెప్పారు.
69 కి పడిపోయిన బలం..
మొత్తం 182 మంది సభ్యులు ఉన్న గుజరాత్ అసెంబ్లీలో 73గా కాంగ్రెస్ బలం.. నలుగురు ఎమ్మెల్యేల రాజీనామాతో ఇప్పుడు 69కి పడిపోయింది. ప్రస్తుతమున్న బలం ప్రకారం.. భాజపాకు రెండు రాజ్యసభ స్థానాలు వచ్చే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ నుంచి క్రాస్ ఓటింగ్ జరుగుతుందన్న నమ్మకంతో మూడో అభ్యర్థిని బరిలో నిలిపింది భాజపా. కాంగ్రెస్ ఇద్దరు అభ్యర్థులను నిలబెట్టింది. రాజ్యసభ ఎన్నికల కోసం భాజపా తమ పార్టీ ఎమ్మెల్యేలపై వల వేస్తోందని భావించిన కాంగ్రెస్.. 24 మంది ఎమ్మెల్యేలను ఇప్పటికే జైపుర్‌కు తరలించింది.
ఇదీ చదవండి: కమల్‌నాథ్ బల పరీక్షపై సందిగ్ధత!