ETV Bharat / bharat

మహారాష్ట్రలో ఒక్కరోజే 1200 కరోనా కేసులు

corona
మహారాష్ట్రలో ఒక్కరోజే 1200 కరోనా కేసులు
author img

By

Published : May 6, 2020, 8:10 PM IST

Updated : May 6, 2020, 10:09 PM IST

21:52 May 06

దేశంలో కరోనా వైరస్​ క్రమంగా విస్తరిస్తోంది. మహారాష్ట్రలో వైరస్ బాధితులు అత్యధికంగా ఉన్నారు. తర్వాతి స్థానాల్లో గుజరాత్, దిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు ఉన్నాయి.

ముంబయిలో 10వేలు

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ఉద్ధృతి ఎక్కువగా ఉంది. ప్రభుత్వం కరోనా నియంత్రణ చర్యలు చేపట్టినప్పటికీ రాష్ట్రంలో మహమ్మారి బాధితులు పెరుగుతూనే ఉన్నారు. గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో 1,233 మందికి వైరస్​ సోకింది.  వీరిలో ఒక్క ముంబయి నుంచే 769 మంది ఉన్నారు. మహానగరంలో ఇప్పటివరకు 10 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో బాధితుల సంఖ్య 16,758 మందికి చేరినట్లు ఆ రాష్ట్ర యంత్రాంగం ప్రకటించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 651 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు 3 వేల మంది డిశ్చార్జి అయినట్లు తెలిపారు.

తమిళనాడులో 771 కేసులు

తమిళనాడులో వైరస్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 771 మందికి వైరస్ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 4,829కి పెరిగిందని ఆ రాష్ట్ర యంత్రాంగం వెల్లడించింది. 35 మంది మహమ్మారికి బలయ్యారు. ప్రస్తుతం 3,275 యాక్టివ్​ కేసులు ఉన్నాయి.

గుజరాత్​లో మరో 380 కేసులు

గుజరాత్​లో కరోనా కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. ఇవాళ మరో 380 మందికి వైరస్ సోకింది. మొత్తం బాధితుల సంఖ్య 6,625కు చేరినట్లు అధికారులు తెలిపారు. తాజాగా 28 మంది మృతి చెందారు. అక్కడ ఇప్పటివరకు 396 మంది వైరస్​కు బలయ్యారు. ఇవాళ ఒక్కరోజే 119 మంది డిశ్చార్జి కాగా.. రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 1500కు చేరింది.

పంజాబ్​లో కొత్తగా133 కేసులు

పంజాబ్​​లో నేడు మరో 133 వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తంగా 1,584మంది ప్రాణాంతక వైరస్​ బారిన పడినట్లు ఆ రాష్ట్ర అధికారులు ప్రకటించారు. 27 మంది ప్రాణాలు కోల్పోయారు. 133 మందికి వైరస్​ నయమైంది.

ఉత్తర్​ప్రదేశ్​లో 118 మందికి..

ఉత్తర్​ప్రదేశ్​లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇవాళ మొత్తం 118 మంది మహమ్మారి బారినపడ్డారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 2,998 మందికి వైరస్​ సోకినట్లు ఆ రాష్ట్ర అధికారులు ప్రకటించారు. మొత్తంగా 1,130 మందిలో వైరస్ నయమైంది. 1,808 యాక్టివ్​ కేసులు ఉన్నాయి. 60 మంది ప్రాణాలు కోల్పోయారు.

రాజస్థాన్​​​లో 3 వేలు దాటిన బాధితులు

రాజస్థాన్​లో కొత్తగా 90 వైరస్ కేసులు నమోదయ్యాయి. మొత్తంగా 3,193 మంది కరోనా​ బారినపడ్డారు. ఇవాళ ఒకరు మృతి చెందగా.. మరణాల సంఖ్య 90కి పెరిగింది. 1,131 మందిలో వైరస్ నయమైంది.

బంగాల్​లో మరో 19 మంది మృతి

బంగాల్​లో నేడు మరో 19 మంది వైరస్​తో ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా మరణించిన వారి సంఖ్య 72కు చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 112 పాజిటివ్ కేసులు నమోదు కాగా... ఇప్పటివరకు 1,456 మందికి వైరస్ సోకిందని అధికారులు వెల్లడించారు. 

కర్ణాటకలో 29 మంది మృతి..

కర్ణాటకలో ఇవాళ మరో 20 కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో మొత్తంగా 693 మందికి వైరస్​ సోకినట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 29 మంది మృతి చెందగా, 354 మంది ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్నారు. 

  • జమ్ముకశ్మీర్​లో మరో 34 మందికి వైరస్​ సోకగా మొత్తంగా 775 మందికి బాధితుల సంఖ్య పెరిగినట్లు తెలిపారు అధికారులు. 322 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు.
  • ఒడిశాలో తాజాగా మూడు కేసులు మాత్రమే నమోదయ్యాయి. రాష్ట్రంలో వైరస్​ బారిన పడిన వారి సంఖ్య 179కి చేరుకుంది. మే 3 నుంచి ఇప్పటివరకు మొత్తం 35,540 మంది వలస కార్మికులు రాష్ట్రానికి చేరుకున్నట్లు అధికారులు వెల్లడించారు. వీరిని 14 రోజుల పాటు క్వారంటైన్​లో ఉంచనున్నట్లు తెలిపారు.
  • హిమాచల్​ప్రదేశ్​లో ఇవాళ ముగ్గురికి మాత్రమే వైరస్​ సోకినట్లు ఆ రాష్ట్ర యంత్రాంగం ప్రకటించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 46 కేసులు నమోదు కాగా.. 34 మంది కోలుకున్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు ముగ్గురు మృతి చెందారు.
  • ఝార్ఖండ్​లో నేడు రెండు కేసులు మాత్రమే నమోదయ్యినట్లు  సమాచారం. ఇప్పటి వరకు 127మందికి వైరస్​ సోకగా.. 27 మంది డిశ్చార్జి​ అయ్యారు.
  • కేరళలో ఈ రోజు ఒక్కకేసు కూడా నమోదు కాలేదని అధికారులు వెల్లడించారు. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 502 మందికి వైరస్​ సోకిందని వెల్లడించారు. మిగతావారిలో వైరస్ నయమైనట్లు సమాచారం. 14,670 మంది వైద్య పరిశీలనలో ఉన్నట్లు స్పష్టం చేశారు.

20:06 May 06

మహారాష్ట్రలో ఒక్కరోజే 1200 కరోనా కేసులు

మహారాష్ట్రలో ఒక్కరోజులో 1233 వైరస్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ముంబయిలోనే 769 మందిలో వైరస్​ ఉన్నట్లు గుర్తించారు అధికారులు. మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 16,758కి చేరింది. మృతుల సంఖ్య 651గా ఉంది.

Last Updated : May 6, 2020, 10:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.