ETV Bharat / bharat

'మహా'లో మహమ్మారి విలయం.. కర్ణాటకలో కల్లోలం - covid-19 death toll in Karnataka

దేశంలోనే కరోనా కేసుల్లో మొదటి స్థానంలో ఉన్న మహారాష్ట్రలో కొత్తగా 12 వేల మందికి పైగా పాజిటివ్​గా తేలింది. కర్ణాటకలో దాదాపు 6 వేల మందికి కరోనా సోకింది. బంగాల్​, గుజరాత్​లోనూ వైరస్​ వ్యాప్తి కొనసాగుతోంది.

12,248 new COVID-19 cases and 390 deaths reported in Maharashtra
మహాలో మహమ్మారి విలయం.. కర్ణాటకలో కల్లోలం
author img

By

Published : Aug 9, 2020, 9:18 PM IST

మహారాష్ట్ర, కర్ణాటకల్లో కరోనా కేసులు విపరీతంగా వెలుగుచూస్తున్నాయి. గుజరాత్​లో కొవిడ్​ బాధితులు పెరుగుతున్నారు. మహారాష్ట్రలో తాజాగా12,248 కేసులు నమోదయ్యాయి. మరో 390 మంది మృత్యువాతపడ్డారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 5,15,332 దాటింది. మరణాల సంఖ్య 17,757కి ఎగబాకింది.

కర్ణాటకలో కరోనా కేసులు భారీగా బయటపడుతున్నాయి. తాజాగా 5,985 మంది వైరస్​ బారినపడ్డారు. మరో 107మంది మహమ్మారికి బలయ్యారు. దాదాపు 94 వేలమంది డిశ్చార్జి​ అయ్యారు.

బంగాల్​లో కొత్తగా 2,059 మందికి కరోనా సోకింది. మరో 54 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 2,059కు చేరింది.

గుజరాత్​లో తాజాగా 1078 కేసులు నమోదయ్యాయి. మరో 25 మంది మృతి చెందారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 71 వేలు దాటింది. ఇప్పటివరకు 2,654 మంది మరణించారు.

ఇదీచూడండి: లైవ్​ వీడియో: యువతిని ఈడ్చుకెళ్లిన కారు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.