ఆరు రోజుల యూఏఈ, సౌదీ అరేబియా పర్యటనకు ఆర్మీ చీఫ్ జనరల్ ఎం. ఎం నరవాణే మంగళవారం బయలుదేరారు. వ్యూహాత్మకంగా ఎంతో ముఖ్యమైన ఈ రెండు గల్ఫ్ దేశాల్లో భారత సైన్యాధ్యక్షుడి హోదా ఉన్న వ్యక్తి పర్యటించడం ఇదే తొలిసారి.
రక్షణ, భద్రతా రంగాల్లో గల్ఫ్ దేశాల సహకారాన్ని నరవాణే పర్యటన బలోపేతం చేస్తుందని భారత్ భావిస్తోంది. తొలుత యూఏఈ చేరుకోనున్న నరవాణే.. అక్కడి సీనియర్ మిలిటరీ అధికారులతో భేటీ అయ్యి.. ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని పెంచుకునే విధానాలపై చర్చించనున్నారు.
అనంతరం ఈ నెల 13-14 తేదీల్లో సౌదీలో పర్యటిస్తారు సైన్యాధ్యక్షుడు. ఈ పర్యటనలో రాయల్ సౌదీ ల్యాండ్ ఫోర్స్, జాయింట్ ఫోర్స్ కమాండ్ ప్రధాన కార్యాలయాలతో పాటు అబ్దుల్ అజీజ్ మిలిటరీ అకాడమీని కూడా సందర్శిస్తారు. పలువురు సీనియర్ అధికారులతో చర్చలు జరుపుతారు.
ఇదీ చూడండి:- రైతు కోసం కదిలిన భారతం- బంద్ ప్రశాంతం