Hijab Controversy: హిజాబ్ వివాదం ప్రజల దృష్టిని మరల్చడానికి భాజపా చేస్తున్న ప్రయత్నం అని అన్నారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ. ఉత్తరాఖండ్ ఎన్నికల్లో ఓటమిని చవిచూస్తామనే భయంతో ఆ పార్టీ ఈ చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. కర్ణాటకలో కొన్ని వారాల క్రితం మొదలైన హిజాబ్ వివాదంపై స్పందిస్తూ ఒవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు.
"యూనిఫామ్ ధరించడం అనేది విద్యార్థి స్వచ్ఛంద నిర్ణయమే కానీ తప్పనిసరి కాదు. ఇదే విషయాన్ని బాబా సాహేబ్ అంబేడ్కర్ స్పష్టం చేశారు. యూనిఫామ్లు అందరికీ ఒక్కలా ఉండవని.. అవి విద్యార్థుల మతాల ఆధారంగా ఉండే అవకాశం ఉందని ప్రధాని మోదీ అర్థం చేసుకోవాలి."
-అసదుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం అధినేత
మా పార్టీ సిద్ధాంతం అదే..
భిన్నత్వంలో ఏకత్వం సిద్ధాంతాన్నే తమ పార్టీ విశ్వసిస్తుంది అని అన్నారు ఒవైసీ. దేశంలో వివిధ రకాల సంస్కృతులు ఉన్నాయని.. అదే భారత్ ప్రత్యేకత అని వ్యాఖ్యానించారు. అందరికీ వారి సంస్కృతికి తగినట్టు నడుచుకునే హక్కును ఆర్టికల్ 29 ద్వారా రాజ్యాంగం కల్పించిందని పేర్కొన్నారు. ఆ ప్రాథమిక హక్కును హరించే అధికారం ఎవరికీ లేదన్నారు.
ఇదీ చూడండి : 'మాఫియాలకు చెక్ పెట్టేది భాజపానే అని ప్రజలు గుర్తించారు'