ETV Bharat / bharat

చీరకట్టులో సవారీలు.. రూ.లక్షల్లో ఆర్జన!

ఒడిశా జాజ్​పుర్​ జిల్లాకు చెందిన ఓ మహిళ వివిధ రకాల వాహనాలను నడపడం సహా గుర్రపుస్వారీ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. యూట్యూబ్​లో రెండు మిలియన్లకుపైగా సబ్​స్క్రైబర్లను సొంతం చేసుకున్న ఆమె.. ప్రస్తుతం రూ. లక్షల్లో సంపాదిస్తోంది.

odisha woman riding horse, మహిళ గుర్రపు స్వారీ ఒడిశా
చీరకట్టులో ఒడిశా మహిళ సాహసాలు
author img

By

Published : Jun 11, 2021, 5:17 PM IST

సవారీలతో ఆకట్టుకుంటున్న మోనాలీసా

పట్టుదల ఉంటే ఏదైనా సాధించొచ్చని నిరూపిస్తోంది ఒడిశా జాజ్​పుర్​ జిల్లా జహాల్​ గ్రామానికి చెందిన ఓ మహిళ. గ్రామీణ ప్రాంతానికి చెందిన మహిళ ద్విచక్రవాహనం నడిపితేనే ఆశ్చర్యపోతాం. అటువంటిది ఈ వివాహిత.. వివిధ వాహనాలతో పాటు గుర్రపు స్వారీ కూడా సునాయాశంగా చేస్తోంది. గుర్రం, బైక్​, కారు, ట్రాక్టర్​, ట్రక్కు ఇలా ఏ వాహనమైనా ఇట్టే నడిపేస్తోంది మోనాలీసా. సంప్రదాయ చీరకట్టులో ఆమె చేస్తున్న ఈ విన్యాసాలకు రూ.లక్షల్లో సంపాదనే కాక అందరి ప్రశంసలు దక్కుతున్నాయి.

ఐదేళ్ల క్రితం మొదలు..

2016లో మోనాలీసా భర్త బద్రీ నారాయణ్​ భద్ర తొలిసారిగా యూట్యూబ్​లో ఆమెకు సంబంధించిన ఓ వీడియోను అప్లోడ్​ చేశాడు. ఆ వీడియోకు ఆదరణ రావడం చూసి.. ఆ తర్వాత గుర్రపుస్వారీ, బుల్లెట్​ బైక్​, భారీ వాహనాలను నడుపుతున్న వీడియోలను అప్లోడ్​ చేశాడు. ఈ క్రమంలోనే వారి యూట్యూబ్​ ఛానెల్​ 2.28 మిలియన్​ సబ్​స్క్రైబర్లను అందుకుంది. మోనాలీసాకు ఆమె భర్త సహా కుటుంబం మద్దతు తెలిపింది.

వాహనాల సవారీలకు సంబంధించిన వీడియోలతో పాటు ఆమె పెంపుడు జంతువులు, కోతులు సహా ఇతర ప్రాణులకు ఆహారం అందిస్తున్న వీడియోలను కూడా మోనాలీసా షేర్​ చేస్తుంది. వీటికి కూడా ఆదరణ దక్కుతోంది.

గ్రామీణ ప్రాంతాల్లోని వివాహితలు ఇంటికే పరిమితం కావాలన్న హద్దును చెరిపేసి మోనాలీసా చేస్తున్న ప్రయత్నం అందరికీ ఆదర్శనీయంగా ఉంది.

ఇదీ చదవండి : ఫుడ్​ డెలివరీ గర్ల్​గా ఇంటర్​ అమ్మాయి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.