ETV Bharat / tv-and-theater

అంబరాన్నంటిన ఆస్కార్​ - best

ఈ ఏడాది ఆస్కార్​లో ఎక్కువ అవార్డులు పొందిన చిత్రంగా 'బొహిమియన్ రాప్సోడీ' రికార్డు సృష్టించింది. ఈ చిత్రం మొత్తం 4 అవార్డులను దక్కించుకుంది. రోమా, బ్లాక్ ప్యాంథర్, గ్రీన్​బుక్ చిత్రాలు మూడు పురస్కారాలతో తరువాతి స్థానాల్లో నిలిచాయి.

ఆస్కార్
author img

By

Published : Feb 25, 2019, 4:18 PM IST

Updated : Feb 25, 2019, 8:42 PM IST

ఆస్కార్ వేడుక అమెరికా లాస్ ​ఏంజిల్స్​లో అట్టహాసంగా జరిగింది. డాల్బీ థియేటర్లో నిర్వహించిన ఈ అవార్డుల ప్రదానోత్సవానికి హాలీవుడ్ ప్రముఖులు తరలివచ్చారు. మిరుమిట్లు గొలిపే కాంతులు, ఎర్ర తివాచీ అందాలు చూపరుల కళ్లను కట్టిపడేశాయి. వ్యాఖ్యాత లేకుండానే నిర్వహించిన 91వ అవార్డుల ప్రదానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.

ఉత్తమ చిత్రం

'గ్రీన్​బుక్' సినిమా ఆస్కార్ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ఆస్కార్ జ్యూరీ ప్రశంసలు అందుకుంది. వర్ణ వివక్ష ఎక్కవగా ఉన్న కాలంలో నలుపు, తెలుపు వ్యక్తుల స్నేహాన్ని కళ్లకు కట్టారు. ఐదు అకాడమీ విభాగాల్లో పోటీపడిందీ చిత్రం. ఉత్తమ సహాయనటుడు, ఒరిజనల్​ స్క్రీన్​ప్లేతో కలిపి మూడు అవార్డులను కైవసం చేసుకుంది గ్రీన్​బుక్.

ఉత్తమ దర్శకుడు: ఆల్ఫాన్సో కురానో

మెక్సికో నగరానికి దగ్గరలో కలోనియా రోమా పట్టణంలో ఉంటున్న మధ్యతరగతి కుటుంబం నేపథ్యంగా తెరకెక్కింది 'రోమా' చిత్రం. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన ఆల్ఫాన్సో కురానో ఉత్తమ దర్శకుడిగా ఆస్కార్ కైవసం చేసుకున్నాడు. అత్యధికంగా ఆస్కార్​కి నామినేటైన ఆంగ్లేతర చిత్రంగా 'రోమా' రికార్డు సృష్టించింది. మొత్తం 10 విభాగాల్లో అకాడమీ అవార్డులకై పోటీ పడింది.

ఉత్తమ నటుడు: రమి మాలెక్

'బ్రిటీష్ రాక్ బ్యాండ్ క్వీన్'​లో లీడ్ సింగరైన ఫ్రెడ్రిక్ మెర్క్యూరీ జీవితం ఆధారంగా తెరకెక్కింది 'బొహిమియన్ రాప్సోడీ'. ఈ చిత్రంలో రమి మాలెక్ తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇప్పటికే ఉత్తమ నటుడిగా గోల్డెన్ గ్లోబ్ అందుకున్న రమి మాలెక్ ఆస్కార్​నీ సొంతం చేసుకున్నాడు.

undefined

ఉత్తమ నటి: ఒలివియన్ కోల్​మాన్

చారిత్రక చిత్రంగా తెరకెక్కిన 'ది ఫేవరేట్' చిత్రంలో బ్రిటీష్ రాణి ఆనీ పాత్రను పోషించింది ఒలివియన్ కోల్​మాన్. ఆమె నటనతో ప్రేక్షకులని అలరించిన ఒలివియన్ తొలిసారి ఆస్కార్​ దక్కించుకుంది.

ఉత్తమ సహాయనటుడు: మహర్షలా అలీ

గ్రీన్​బుక్ చిత్రానికి గాను మహర్షలా అలీ ఉత్తమ సహాయనటుడు పురస్కారాన్ని ముద్దాడాడు.

లేడి గాగా ఉత్తమ గాయని

ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో లేడిగాగా ఆస్కార్ అందుకుంది. ఏ స్టార్ ఈజ్​ బోర్న్ చిత్రంలోని షాలో పాటకు గానూ ఆమెకు ఈ అవార్డు దక్కింది.

అంబరాన్నంటిన ఆస్కార్​

Intro:Body:Conclusion:
Last Updated : Feb 25, 2019, 8:42 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.