అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో ఆస్కార్ ప్రదానోత్సవాలు అట్టహాసంగా మొదలయ్యాయి. డాల్బీథియేటర్లలో జరుగుతున్న ఈ వేడుకల్లో హాలీవుడ్ ప్రముఖులు ఎర్ర తివాచీపై హొయలొలికించారు. ఈ వేడుకకు తొలి సారిగా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ హాజరైంది.
ఉత్తమ సహాయనటి విభాగంలో రెజీనా కింగ్ ఆస్కార్ దక్కించుకుంది. ఇఫ్ బీల్ స్ట్రీట్ కుడ్ టాక్ చిత్రంలో నటనకు గాను ఆమె తొలి సారి అకాడమీను గెల్చుకుంది. సినిమాటోగ్రఫీ విభాగంలో అల్ఫాన్సోకురానో అవార్డు పొందాడు. 10 సార్లు నామినేట్ అయిన కురానో మూడో సారి ఆస్కార్‌ను దక్కించకున్నాడు.
ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ చిత్రంగా 'ఫ్రీ సోలో' అవార్డు గెల్చుకుంది. ఎలిజెబెచ్ చాయ్ ఈ అవార్డుని అందుకుంది. ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్‌గా రూత్‌కార్టర్ బ్లాక్ 'ప్యాంథర్' చిత్రానికి ఆస్కార్‌ని గెల్చుకుంది. మూడు సార్లు నామినేట్ కాగా తొలిసారి అవార్డు అందుకుంది. ఉత్తమ విదేశీ చిత్రంగా 'రోమా' నిలిచింది.
ఉత్తమ సహాయనటుడు విభాగంలో మహర్షల్ అలీ ఆస్కార్ గెల్చుకున్నాడు. గ్రీన్‌బుక్ చిత్రానికి గాను ఈ అవార్డు దక్కించుకున్నాడు. 2017లోనూ మూన్లైట్ చిత్రానికి అకాడమీ అందుకున్నాడు. ఉత్తమ యానిమేటడ్ చిత్రంగా స్పైడర్ మెన్ ఇన్‌టూ ది స్పైడర్ చిత్రానికి అకాడమీ పొందాడు.