దివ్య ఓం ప్రకాశ్ భారతి అంటే చాలామందికి తెలియదు.. బలపం పట్టి భామ బళ్లో అంటూ బొబ్బిలి రాజాతో చిందేసిన దివ్యభారతి అంటే టక్కున గుర్తు పట్టేస్తారు. 16 ఏళ్లకే తెరంగేట్రం చేసిన ఈ ముంబయి సుందరి దురదృష్టవశాత్తు 19 ఏళ్ల వయసులోనే చనిపోయింది. తెలుగు, హిందీ చిత్ర సీమలో తనదైన ముద్రవేసిన దివ్యభారతి జయంతి సందర్భంగా ఆమె గురించి కొన్ని విషయాలు చూద్దాం!
- " class="align-text-top noRightClick twitterSection" data="">
జననం
ఓమ్ ప్రకాశ్ భారతి, మీటా భారతి దంపతులకు 1974 ఫిబ్రవరి 25న బొంబాయిలో జన్మించింది దివ్యభారతి. 10వ తరగతి పూర్తి చేయకముందే సినిమా ఆఫర్లు రావడంతో చదువు ఆపేసింది. తెలుగులో అగ్ర కథానాయకులందరి సరసన నటించి హిందీలోనూ స్టార్‌డమ్‌ని సంపాదించింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
తెలుగులోనే ప్రస్థానం మొదలు
విక్టరీ వెంకటేశ్ నటించిన బొబ్బిలి రాజా చిత్రంతో సినీ పరిశ్రమలో తెరంగేట్రం చేసింది దివ్యభారతి. తొలి సినిమాతో మంచి విజయాన్ని అందుకుని స్టార్ హీరోలందరితోనూ జతకట్టింది. చిరంజీవితో కలిసి రౌడీ అల్లుడులో ఆడిపాడి అసెంబ్లీ రౌడీలో మోహన్‌బాబుతో నటించి కనువిందు చేసింది. అనంతరం నందమూరి బాలకృష్ణతో ధర్మక్షేత్రంలో కనిపించి వరుస హిట్లతో దూసుకెళ్లింది. తెలుగులో చివరి చిత్రం తొలి ముద్దులో ప్రశాంత్‌తో జతకట్టింది. ఈ చిత్రం షూటింగ్లో ఉన్నప్పుడే ఆమె చనిపోవడంతో మిగిలిన భాగం మరో నటితో తెరకెక్కించారు. శ్రీదేవి పోలికలతో కనిపించే ఈ ముంబయి భామ జూనియర్ శ్రీదేవిగా పేరు గడించింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
మైమరిపించే గీతాలు
'అసెంబ్లీ రౌడీ'లో 'అందమైన వెన్నెలలోన అచ్చ తెలుగు పడచువలే' కనిపస్తూ తెలుగువారిపై వెన్నెల కురిపిచింది. ప్రేక్షకుల చేత 'బలపం పట్టించి' ప్రేమాక్షరాలను దిద్దించింది. 'ప్రేమ గీమా పక్కన పెట్టించి' తన వయ్యారాలతో హొయలొలికించింది. 'ఎన్నో రాత్రులొస్తాయిగాని రాదీ వెన్నెలమ్మ' గీతంతో యవత స్వప్న సుందరిగా నిలిచింది. 'లవ్ మి మై హీరో మజాగా ముద్దిస్తా రారో' అంటూ కుర్రకారు గుండెల్లో గుబులు రేపింది. టీనేజి వయసులోనే తెరపై దుమ్మురేపి.. వెండితెర నుంచి శాశ్వతంగా కనుమరుగైంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
హిందీలో స్టార్డమ్
హిందీలో 'విశ్వాత్మ' చిత్రంతో బాలీవుడ్లో అడుగుపెట్టింది దివ్యభారతి. రిషి కపూర్, షారుఖ్‌ఖాన్ కలిసి నటించిన 'దివానా' చిత్రంతో బాలీవుడ్లో స్టార్డమ్ తెచ్చుకుంది. ఆ సినిమాకి గాను ఫిల్మ్ ఫేర్ లక్స్ న్యూ ఫేస్ ఆఫ్ ది ఇయర్-1992 అవార్డు దక్కించుంకుంది. ఆ తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. నాలుగేళ్లలో తెలుగు, హిందీలో కలిపి 20 చిత్రాల్లో నటించింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
కెరీర్ ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడే 1992లో ప్రముఖ నిర్మాతను సాజిద్ నడియావాలాను పెళ్లాడింది దివ్యభారతి. 1993 మార్చి ఏప్రిల్ 5న ముంబయిలోని ఐదో ఫ్లోర్లో ఉన్న తన అపార్ట్‌మెంటుపై నుంచి కిందపడి మరణించింది. ప్రమాదవశాత్తు మరణంగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.