స్వయంకృషిలో చిరంజీవిని చెప్పులు కుట్టేవాడిగా చూపించిన ఘనత ఆయనదే. సాగరసంగమంలో కమల్‌హాసన్‌ను అమాయకుడిలా తెరకెక్కించిన గొప్పతనం ఆ దర్శకుడిదే. వెండితెరపై మానవుడి జీవితాన్ని కళ్లకు కట్టినట్టు చూపించడం ఆయన ప్రత్యేకత. ఆయనే తెలుగు చలన చిత్రసీమకు ఎన్నో గొప్ప చిత్రాలు అందించిన కాశీనాధుని విశ్వనాధ్. ఈరోజు ఆయన 89వ పుట్టినరోజు.
ఆణిముత్యాలెన్నో..
1960లో సినీ దర్శకుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించిన విశ్వనాథ్ ..తెలుగు ప్రేక్షకులకు ఆణిముత్యాల్లాంటి ఎన్నో చిత్రాలను అందించారు. శంకరాభరణం, శుభలేఖ, సాగర సంగమం, స్వాతిముత్యం, సిరివెన్నెల, స్వయంకృషి, స్వర్ణకమలం, స్వాతి కిరణం, ఆపద్భాందవుడు, శుభ సంకల్పం, స్వరాభిషేకం చిత్రాలు ఆ జాబితాలో ఉన్నాయి.
నటుడిగానూ..
దర్శకుడిగానే కాకుండా నటుడిగానూ పలు చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఆస్కార్‌కు స్వాతిముత్యం..
ఆయన తెరకెక్కించిన స్వాతిముత్యం 1986లో ఆస్కార్ అవార్డుకు అధికారక ప్రవేశం పొందింది. శంకరాభరణం చిత్రానికి జాతీయ పురస్కారం సొంతం చేసుకున్నారు కళాతపస్వి కె.విశ్వనాధ్.
సినీ రంగానికి చేసిన కృషికి గాను 2016లో దాదాసాహెబ్ పురస్కారం అందుకున్నాడు. భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ఇచ్చి ఆయన్ని గౌరవించింది.
ఆయన జీవితాన్ని "విశ్వదర్శనం" పేరుతో సినిమాగా తెరకెక్కిస్తున్నారు. జనార్ధన మహార్షి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.