ఈ నెల 14న పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ స్పందించింది. జమ్మూకశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేయాలని ప్రధానికి విజ్ఙప్తి చేసింది. ఆర్టికల్ 370 కారణంగానే రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు, కొత్త చట్టాలు రూపొందించేందుకు పార్లమెంటుకు పరిమితులు అడ్డుపడుతున్నాయి.
"ముందు మనం ఈ దాడిని సైన్యంపై దాడిగా పిలవటం ఆపాలి. ఇది మనందరిపై జరిగిన దాడి. ఎందుకంటే సైనికులు మన రక్షకులు మన కోసం వారు ప్రాణాలర్పించారు. " - కంగనా రనౌత్, బాలీవుడ్ నటి
ఈ సారి మనం నిర్మాణాత్మక చర్యలు చేపట్టాలి. స్వాతంత్య్రంవచ్పి ఇన్నేళ్లైనా ఓ రాష్ట్రప్రజలు తాము ఏ రాష్ట్రానికి చెందిన వారమో తేల్చుకోలేని అయోమయంలో ఉన్నారని కంగనా ఆవేదన వ్యక్తం చేసింది. ఇందుకోసం దేశ ప్రజలంతా కలిసి ప్రధానిని ఆర్టికల్ 370ని రద్దు చేయాల్సిందిగా కోరి అది అమలయ్యేల చూడాల్సిన అవసరముందని కోరింది.
పాకిస్థానీ నటులపై నిషేధం గురించి కూడా కంగనా స్పందించింది. పాకిస్థాన్ ప్రజలు మన సినిమాలను, మన నటులను ఇష్టపడతారు. కానీ కొన్ని సందర్భాల్లో గిరి గీసుకోక తప్పదని వెల్లడించింది.