విశాఖ జిల్లా ఆర్వీనగర్ నుంచి తూర్పుగోదావరి జిల్లా పాలగెడ్డ వరకు ఉన్న అంతరాష్ట్ర రహదారి శిథిలావస్థకు చేరింది. అధికారుల నిర్లక్ష్యానికి వైఖరికి నిరసనగా... విశాఖ జిల్లా గూడెం కొత్తవీధి మండలం ప్రజలు సోమవారం పెద్ద ఎత్తున బంద్‌కు పిలుపునిచ్చారు. అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. సీలేరు వాసులు రహదారిపై వంటావార్పు నిర్వహించి ఆందోళన చేశారు. ధారకొండ, సప్పర్ల వద్ద కూడా ఆందోళనకారులు రహదారికి అడ్డంగా వాహనాలు, రాళ్లు పెట్టి రాకపోకలకు ఆటంకం కల్పించారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న చలనం లేకపోవడం వల్ల బంద్‌కు పిలుపునిచ్చామని అఖిలపక్ష నాయకులు తెలిపారు. దీంతో ఒడిశా, విశాఖ, భద్రాచలంకు వెళ్లే రహదారులు స్తంభించాయి. పాఠశాలలు, ప్రభుత్వ, జెన్‌కో కార్యాలయాలు మూతబడ్డాయి. వాహనాల్లో, బస్సుల్లో ఉన్నవారు కూడా ఆందోళన చేస్తున్న వారితో జతకలిసి నినాదాలు చేశారు.
రహదారి మరమ్మతులు చేయాలని స్థానికుల ఆందోళన - vizag tribal roads are weird
విశాఖ జిల్లా గూడెం కొత్తవీధి మండలం ప్రజలు పెద్ద ఎత్తున బంద్ నిర్వహించారు. రోడ్లు శిథిలావస్థకు చేరాయని అనేక సార్లు మొరపెట్టుకన్నా.. అధికారులకు చలనం లేదని స్థానికులు నిరసనకు దిగారు. అఖిలపక్ష నాయకులు ఈ ఆందోళనకు మద్దతు తెలిపారు.
విశాఖ జిల్లా ఆర్వీనగర్ నుంచి తూర్పుగోదావరి జిల్లా పాలగెడ్డ వరకు ఉన్న అంతరాష్ట్ర రహదారి శిథిలావస్థకు చేరింది. అధికారుల నిర్లక్ష్యానికి వైఖరికి నిరసనగా... విశాఖ జిల్లా గూడెం కొత్తవీధి మండలం ప్రజలు సోమవారం పెద్ద ఎత్తున బంద్‌కు పిలుపునిచ్చారు. అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. సీలేరు వాసులు రహదారిపై వంటావార్పు నిర్వహించి ఆందోళన చేశారు. ధారకొండ, సప్పర్ల వద్ద కూడా ఆందోళనకారులు రహదారికి అడ్డంగా వాహనాలు, రాళ్లు పెట్టి రాకపోకలకు ఆటంకం కల్పించారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న చలనం లేకపోవడం వల్ల బంద్‌కు పిలుపునిచ్చామని అఖిలపక్ష నాయకులు తెలిపారు. దీంతో ఒడిశా, విశాఖ, భద్రాచలంకు వెళ్లే రహదారులు స్తంభించాయి. పాఠశాలలు, ప్రభుత్వ, జెన్‌కో కార్యాలయాలు మూతబడ్డాయి. వాహనాల్లో, బస్సుల్లో ఉన్నవారు కూడా ఆందోళన చేస్తున్న వారితో జతకలిసి నినాదాలు చేశారు.
నిరసనగా గూడెంకొత్తవీధి మండలం బంద్ సోమవారం పెద్ద ఎత్తున జరిగింది. బంద్ వల్ల అంతర్‌రాష్ట్ర రాకపోకలునిలిచిపోయాయి. అఖిలపక్షనాయకుల ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు హజరయ్యారు. అటు మండల కేంద్రం వద్ద , ఇటు సీలేరు వద్ద నున్న అంతర్ రాష్ట్ర కూడలిలో అఖిలపక్ష నాయకులు వంటావార్పు నిర్వహించారు. ఈ సందర్భంగా రహదారిపై వంటావార్పు చేసి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించగా, ధారకొండ, సప్పర్ల వద్ద కూడా ఆందోళనకారులు రహదారికి అడ్డంగా వాహనాలుపెట్టి, రాళ్లు పెట్టి రాకపోకలకు ఆటకం కల్పించారు. ఈ రహదారిపై కనికరించండంటూ ఎన్ని సార్లు అధికారులను కలిసి మొరపెట్టకున్నప్పటికీ అధికారుల్లో చలనం లేకపోవడంతో మండలంలో బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మండలంలో వ్యాపారసంస్థలన్నీ మూతబడ్డాయి. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, జెన్‌కో కార్యాలయాలు మూతబడ్డాయి. మరో వైపు ఆంధ్రా-ఒడిశా రహదారిని దిగ్భందనం చేసి రాకపోకలు నిలిపివేశారు. రహదారిపై వంటావార్పు చేశారు. దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్థంబించిపోయింది. ఒక వైపు ఒడిశా, మరో వైపు విశాఖ, భద్రాచలంకు వెళ్లే రహదారులు స్థంబించాయి. పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. వాహనాల్లో , బస్సుల్లో ఉన్నవారు కూడా ఆందోళన చేస్తున్న వారితో జతకలిసి నినాదాలు చేశారు.Conclusion:M Ramanarao,9440715741