ప్రకాశం జిల్లా మార్కాపురం ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన సమావేశం రసాభాసగా మారింది. సాయంత్రం ఐదు గంటల సమయంలో రేషన్ కార్డులపై సచివాలయ ఉద్యోగులు, రెవెన్యూ ఉద్యోగులతో ఎంపీడీవో హనుమంతరావు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఓ వీఆర్వోను ఎంపీడీవో ఏకవచనంతో మాట్లాడటం... తోటి వీఆర్వోలు జీర్ణించుకోలేక పోయారు. దీంతో సమావేశమంతా రసాభాసగా మారింది. తిట్ల దండకంతో కార్యాలయమంతా హోరెత్తింది. ఎంపీడీవో తీరును నిరసిస్తూ డిప్యూటీ తహసీల్దార్ భాగ్యలక్ష్మితో సహా వీఆర్వోలు, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు సమావేశం నుంచి బయటకు వచ్చేశారు.
ఇదీ చదవండి :