విశాఖ నుంచి హైదరాబాద్కు గంజాయి తరలిస్తుండగా గుంటూరు జిల్లా తాడేపల్లిలో నలుగురు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ నలుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు అరకులో ఓ మధ్యవర్తి ద్వారా రెండున్నర కిలోల గంజాయి కొనుగోలు చేసి... హైదరాబాద్కు తరలిస్తున్నారని తాడేపల్లి సీఐ అంకమరావు వెల్లడించారు. దారి మధ్యలోనే పావుకిలో గంజాయిని విద్యార్థులు సేవించినట్లు సీఐ తెలిపారు. గంజాయితో పాటు కారును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి: అవనిగడ్డలో 30 లక్షల విలువైన గంజాయి స్వాధీనం