తూర్పుగోదావరి జిల్లా నాగులాపల్లి జడ్పీ పాఠశాలలో సూమారుగా 250 మంది విద్యార్ధులు విద్యనభ్యసిస్తున్నారు. కానీ చదువుకోవటానికి మాత్రం ఆ పాఠశాలలో సరైన వసతులు లేవు. శిథిలావస్థలో ఉన్న భవనాల కింద ప్రాణాభయంతో చదువును నెట్టుకువస్తున్నారు. ఒకే భవనంలో అన్ని తరగతులు నిర్వహించటంతో వారిలో మరింత ఆందోళన మెుదలైంది. భవనం పైభాగం పెచ్చులుడి మీదపడుతున్నాయని భయపడుతున్నారు విద్యార్థులు. వర్షాకాలంలో పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని విద్యార్థులు వాపోతున్నారు. కూర్చోటానికి చోటులేక... పుస్తకాలన్ని తడిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అంతేగాక గోడలకు విద్యుత్ షాక్ వస్తుందంటున్నారు.నూతన భవనం నిర్మించేందుకు ఉపాధ్యాయులు ప్రతిపాదనలు పంపిచారు. కానీ నిధులు మాత్రం రాకపోవటం వలన శిథిలమైన భవనంలోనే చదువులు చెబుతున్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులు,విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఇవీ చదవండి