16 ఏళ్ల టెన్నిస్ క్రీడాకారుడు ఆర్యన్ భాటియా, జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ(నాడా) జరిపిన పరీక్షల్లో పట్టుబడ్డాడు. అతడిపై నాడా సస్పెన్షన్ వేటు వేసింది. గతేడాది అక్టోబర్‌లో జరిగిన 'ఫెనెస్టా ఓపెన్ జాతీయ టెన్నిస్ ఛాంపియన్‌షిప్'లో ఈ కుర్రాడు పాల్గొన్నాడు. అక్కడ జరిపిన డోపింగ్ పరీక్షలో ఆర్యన్ విఫలమైనట్లు తేలింది. ఆర్యన్‌పై నాడా వేటు గురించి అఖిల భారత టెన్నిస్ అసోసియేషన్ స్పందించింది.
' కేవలం అజ్ఞానం వల్లే ఈ తప్పు జరిగింది. జలుబు తగ్గడం కోసం వైద్యుడు ఇచ్చిన మాత్ర వేసుకున్నాడు. అందులో నిషేధిత ఉత్ప్రేరకం ఉందని తెలియక వాడాడు. డోపింగ్‌లో అతను చేసుకున్న అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుంటాం'.
- ఏఐటీఎఫ్ కార్యదర్శి, హిరణ్మయ్ ఛటర్జీ
గత నెలలో నిర్వహించిన డోపింగ్ టెస్టుల్లో పట్టుబడి...ఏడుగురు ఆటగాళ్లు వేటు ఎదుర్కొంటున్నారు. సందీప్ కౌర్ (పవర్‌లిఫ్టింగ్), అంకింత్ గోశాయ్(హ్యాండ్ బాల్), జితూ థామస్ (వాలీబాల్), ఎయ్ఫబా (కేనాయింగ్), విషన్ సింగ్ (కయాకింగ్) , శివమ్ కసనా(సైక్లింగ్ ) ఇందులో ఉన్నారు.