భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రికి మరో గౌరవం లభించింది. దిల్లీ ఫుట్‌బాల్ అసోసియేషన్ "ఫుట్‌బాల్ రత్న" పురస్కారంతో ఛెత్రిని గౌరవించింది. అసోసియేషన్ అధ్యక్షుడు షాజీ ప్రభాకరన్ అవార్డును ప్రదానం చేశారు.
నాకు ఈ పురస్కారం దక్కడం గౌరవంగా భావిస్తున్నాను. వీలైనంతగా దిల్లీ ఫుట్‌బాల్ అసోసియేషన్‌కు సాయపడతాను. ప్రస్తుత యాజమాన్యం బాగా పనిచేసి దిల్లీని మోడల్ ఫుట్‌బాల్ రాష్ట్రంగా తీర్చిదిద్దనుంది --ఛెత్రి
ఈ సంవత్సరమే పద్మశ్రీ పురస్కారంతో ఛెత్రిని కేంద్ర ప్రభుత్వం సత్కరించింది.
ఛెత్రి ఆటతో మేం స్ఫూర్తి పొందాం. అతడి క్రీడా నైపుణ్యం, క్రమశిక్షణ, ఆటపైనున్న ఇష్టం... మైదానంలో, బయట అతడి వ్యక్తిత్వాన్ని తెలిపాయి. ప్రతి భారతీయుడు అతడ్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. దిల్లీ ఫుట్‌బాల్ అసోసియేషన్‌కు సునీల్ ఛెత్రి సహాయపడతానని అనడం నిజంగా శుభపరిణామం-- ప్రభాకరన్
యూత్ ప్లేయర్‌గా శుభం సారంగిని సత్కరించింది అసోసియేషన్. అతడు ప్రస్తుతం ఐఎస్ఎల్లో దిల్లీ డైనమోస్‌కు ఆడుతున్నాడు. భారత్ అండర్-14, అండర్-17 జట్టుకు కూడా ప్రాతినిధ్యం వహించాడు.