ఫిబ్రవరి 24 నుంచి ఆరంభమయ్యే ఆస్ట్రేలియా సిరీస్‌కు టీమిండియాను ప్రకటించింది బీసీసీఐ. న్యూజిలాండ్ సిరీస్‌కు దూరమైన కేఎల్ రాహుల్ టీట్వంటీ, వన్డేల్లో పునరాగమనం చేశాడు. వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ దినేశ్ కార్తీక్‌కు నిరాశే ఎదురైంది. లెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కండేకు టీట్వంటీల్లో కొత్తగా అవకాశమిచ్చారు.
ఈ సిరీస్‌లో భాగంగా రెండు టీట్వంటీలు, ఐదు వన్డేలు ఆడనుంది మెన్ ఇన్ బ్లూ. ప్రపంచకప్ ముందు జరిగే చివరి సిరీస్ ఇదే. మే 30న వరల్డ్ కప్ ప్రారంభం కానుంది.
భారత్-ఏ తరఫున అద్భుత ఇన్నింగ్స్ ఆడుతూ జాతీయ జట్టులోకి పునరాగమనం చేశాడు రాహుల్. ఆడవాళ్లపై అనుచిత వ్యాఖ్యల చేసి పాండ్యతో పాటు అతను కూడా నిషేదానికి గురై విమర్శలు ఎదుర్కొన్నాడు.
ఇంగ్లండ్ లయన్స్‌పై రెండో అనధికారక టెస్టులో ఇండియా-ఏ తరఫున 5 వికెట్లు తీసి.. 68 పరుగులతో విజయాన్ని అందుకోవడంలో మార్కండే పాత్ర కూడా ఉంది. ఆ ఆటతో సెలక్షన్ కమిటీ దృష్టిలో పడ్డాడు. ఆస్ట్రేలియా సిరీస్‌కు ఎంపికయ్యాడు. ఐపీఎల్లో ప్రస్తుతం అతను ముంబయి ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్ స్థానం చివరకు రిషభ్ పంత్‌కే దక్కింది. అతను టీట్వంటీ, వన్డేల్లో చోటు సంపాదించాడు. దినేశ్ కార్తీక్ వన్డేల్లో చోటు కోల్పోయాడు.
టీట్వంటీలు, మొదటి రెండు వన్టేలకు భారత జట్టు ఇదే..
టీట్వంటీ సిరీస్ జట్టు..
విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), ధావన్, రాయుడు, జాదవ్, ధోనీ(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య, బుమ్రా, విజయ శంకర్, చాహల్, ఉమేశ్ యాదవ్, సిద్దార్థ్ కౌల్, మాయంక్ మార్కండే.
మొదటి వన్డే జట్టు..
విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), ధావన్, రాయుడు, జాదవ్, ధోనీ(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, బుమ్రా, షమి, చాహల్, కుల్దీప్ యాదవ్, విజయ్ శంకర్, రిషభ్ పంత్, సిద్దార్థ్ కౌల్, కేఎల్ రాహుల్.
రెండో వన్డే జట్టు..
విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), ధావన్, రాయుడు, జాదవ్, ధోనీ(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, బుమ్రా, భువనేశ్వర్ కుమార్, చాహల్, కుల్దీప్ యాదవ్, షమి, విజయ్ శంకర్, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్.