ETV Bharat / cricket

సచిన్​ మారథాన్ సాయం - marathon

మారథాన్ నిర్వహించి ఒక్కొక్కరి నుంచి రూ.100 వసూలు చేసి ఆ నిధిని అమరవీరుల కుటుంబాలకు ఇవ్వనుంది ఐడీబీఐ ఫెడరల్ సంస్థ.

సచిన్​ మారథాన్
author img

By

Published : Feb 22, 2019, 6:33 AM IST

పుల్వామా దాడిలో ప్రాణాలర్పించిన జవాన్ల కుటుంబసభ్యుల సహాయార్థం క్రికెట్ దిగ్గజం సచిన్​ తెందుల్కర్ ముందుకొచ్చాడు. ఐడీబీఐ జీవిత బీమా సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం నాడు దిల్లీలో నిర్వహించే మారథాన్​లో పాల్గొననున్నాడు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చే సొమ్మును అమరవీరుల కుటుంబాలకు ఇవ్వనున్నారు.

మారథాన్ కంటే ముందు దిల్లీలోని జవహారలాల్ నెహ్రూ స్టేడియంలో పుషప్స్ తీసి '#కీప్ మూవింగ్ పుషప్ ఛాలెంజ్'​లో పాల్గొంటాడు సచిన్. ఈ మారథాన్​లో ఒక్కొక్కరి నుంచి రూ.100 వసూలు చేసి ఆ నిధిని అమర వీరుల కుటుంబాలకు ఇవ్వనుంది ఐడీబీఐ ఫెడరల్ సంస్థ.

18వేల మంది పాల్గొనే మారథాన్ నాలుగు విభాగాలుగా నిర్వహిస్తారు. ఫుల్ మారథాన్(42 కి.మీ)లో 2000, హాఫ్ మారథాన్(21కి.మీ)లో 6000, 10కే రన్​లో 5500, 5కే స్వచ్ఛభారత్ మారథాన్​లో 4500 మంది పాల్గొంటారు. ఐడీబీఐ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థకు తెందుల్కర్ బ్రాండ్ అంబాసిడర్​గా వ్యవహరిస్తున్నాడు.

"మన హద్దుల్ని చెరిపేసి, సమస్యను సవాల్​గా స్వీకరిస్తే విజయం వరిస్తుంది. దీన్ని నేను గట్టిగా విశ్వసిస్తాను. రన్నర్లందరూ నాతో కలిసి ఈ సవాల్​ని స్వీకరించి భవిష్యత్తుని ధృడంగా మార్చుకోవాల్సిందిగా కోరుతున్నాను" --సచిన్ తెందుల్కర్

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.