ముంబయి వాంఖడే స్టేడియంలో భారత్, ఇంగ్లాండ్ మహిళల మధ్య జరుగుతున్న మూడో వన్డేలో అమ్మాయిలు 50 ఓవర్లలో 205 పరుగులు చేశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న మిథాలీ సేన ఖాతా తెరవకుండానే రోడ్రిగ్స్ వికెట్ కోల్పోయింది. అనంతరం స్మతి మంధానా(66), పూనమ్(56) నిలకడగా ఆడి ఇన్నింగ్స్‌ని గాడిలో పెట్టారు. వీరిరువురు 28వ ఓవర్‌కి 129 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మంధానా ఎప్పటిలాగే మెరుపులు మెరిపిస్తూ ఆడగా, పూనమ్ స్మృతికి సహకరించింది. స్మృతి ఔటైన తర్వాత మిగిలిన బ్యాట్స్ఉమెన్ వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు.
చివరాఖరున దీప్తి శర్మ(27), షికా పాండే(26) మరో వికెట్ పడకుండా ఆచితూచి ఆడగా భారత్ గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది. వీరిద్దరు 47 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. చివరి నాలుగు ఓవర్లలో నెమ్మదిగా ఆడగా మిథాలీ సేన అనుకున్నంత స్కోరు సాధించలేకపోయింది.
కెప్టెన్ మిథాలీ 7 పరుగులకే కేథరిన్ బ్రంట్ బౌలింగ్‌లో వెనుదిరిగింది. ఒకే ఓవర్లో స్మృతి మంధానా, పూనమ్ రౌత్‌ని ఔట్ చేసిన కేథరిన్ భారత టాప్ ఆర్డర్‌ని కుప్పకూల్చింది. 10 ఓవర్ల కేవలం 28 పరుగులు ఇచ్చి 5 వికెట్ల తీసింది బ్రంట్. మొదటి ఐదుగురు బ్యాట్స్ఉమెన్ కెథరిన్ బ్రంట్‌కే దొరికిపోయారు.