ముంబయి వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ ఘనవిజయం సాధించింది. మూడు మ్యాచ్ ల సిరీస్ లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మొదట 202 పరుగులకే ఆలౌట్ అయిన భారత మహిళా జట్టు...బౌలర్ల అద్భుత ప్రతిభతో ఇంగ్లండ్‌ను కట్టడి చేసింది. రెండో మ్యాచ్ ఫిబ్రవరి 25 సోమవారం జరగనుంది.
- ఓపెనింగ్ సద్వినియోగం కాలేదు..
తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు శుభారంభాన్నిచ్చారు ఓపెనర్లు. రోడ్రిగ్స్ 48 పరుగులు, స్మృతి మంధాన 24 పరుగులు చేశారు. మొదటి వికెట్‌కు 69 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కెప్టెన్ మిథాలీ రాజ్(44 పరుగులు) మినహా మిగిలిన వారు తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు.
We defeat England Women by 66 runs in the 1st ODI
— BCCI Women (@BCCIWomen) February 22, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Three wickets for Ekta Bisht in the 40th over 👏👏
We take a 1-0 lead in the three match ODI series #ENGvIND pic.twitter.com/80GC4MxKqR
">We defeat England Women by 66 runs in the 1st ODI
— BCCI Women (@BCCIWomen) February 22, 2019
Three wickets for Ekta Bisht in the 40th over 👏👏
We take a 1-0 lead in the three match ODI series #ENGvIND pic.twitter.com/80GC4MxKqRWe defeat England Women by 66 runs in the 1st ODI
— BCCI Women (@BCCIWomen) February 22, 2019
Three wickets for Ekta Bisht in the 40th over 👏👏
We take a 1-0 lead in the three match ODI series #ENGvIND pic.twitter.com/80GC4MxKqR
చెలరేగిన ఏక్తా ...
ఎనిమిది ఓవర్లు బౌలింగ్ చేసిన ఏక్తా బిస్త్ 25 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు కీలక వికెట్లు పడగొట్టింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఈమెకే లభించింది.
భారత బౌలర్లలో శిఖా పాండే, దీప్తి శర్మ చెరో రెండు వికెట్లు తీశారు
- కెప్టెన్ నాటౌట్...
44 పరుగులు చేసిన ఇంగ్లండ్ క్రీడాకారిణి నాథాలి స్కైవర్ కు...కెప్టెన్ హేతర్ నైట్ నుంచి కొంత మద్దతు లభించింది. సారథి 39 పరుగులు చేసి జట్టును గెలిపించేందుకు ఒంటరి పోరాటం చేసినా ప్రయోజనం లేకపోయింది.
డబుల్ హ్యట్రిక్
రెండు జట్ల నుంచి రెండు హ్యాట్రిక్ డకౌట్ లు నమోదయ్యాయి. భారత జట్టులో మోనా, ఏక్తా బిస్త్, పూనం యాదవ్ డకౌట్‌గా వెనుదిరిగారు. ఇంగ్లాడ్ జట్టులో అన్య, సోఫీ, అలెక్స్ సైతం మనదారిలోనే నడిచారు.
- బౌలర్ల ఆధిపత్యం..భారత్ తక్కువ స్కోరు
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ గెలిచిన ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగిన భారత జట్టుకు ఇంగ్లీష్ బౌలర్లు కళ్లెం వేశారు. పరుగులను నియంత్రిస్తూ.. వెంట వెంటనే వికెట్లు తీస్తూ అతిథ్య జట్టును ఆత్మరక్షణలోకి నెట్టేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో అద్భుతంగా బౌలింగ్ చేసిన సోఫి కేవంల 27 పరుగులే ఇచ్చి 2 వికెట్లు తీసింది. మిగతా బౌలర్లు స్కీవర్, ఎల్విస్.. చెరో రెండు వికెట్లు పడగొట్టారు.అన్యా ఒక వికెట్ తీసింది.