ఇంగ్లాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కి జట్టును ప్రకటించింది బీసీసీఐ సెలక్షన్ కమిటీ. హర్మన్ ప్రీత్ గాయంతో సిరీస్‌కి దూరమవగా స్మృతీ మంధానా జట్టుకు సారథ్యం వహించనుంది. వన్డే జట్టు కెప్టెన్ మిథాలీ కూడా 15 మందితో కూడిన జట్టులో ఉంది.
హర్మన్ ప్రీత్ గాయం నుంచి ఇంకా కోలుకోలేదని ఆమె స్థానంలో మంధానా జట్టుకు సారథ్యం వహిస్తుందని సెలక్షన్ కమిటీ తెలిపింది.
కొత్తగా బ్యాట్స్ ఉమెన్ భారతి ఫుల్మాలి, లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కోమల్ జంజాద్కి అవకాశం కల్పించారు. న్యూజిలాండ్ సిరీస్‌కు ఎంపిక కాని వేదకృష్ణమూర్తి తిరిగి జట్టులో స్థానం సాధించింది.
మార్చి 4న గువహతిలో జరిగే టీ20తో సిరీస్ ప్రారంభం కానుంది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే భారత్ గెలుచుకున్న సంగతి తెలిసిందే.
జట్టు
స్మృతి మంధానా(కెప్టెన్), మిథాలీ రాజ్, రోడ్రిగ్స్, దీప్తి శర్మ, తనియా భటియా, భారతి ఫుల్మాలి, అనుజా పాటిల్, శిఖా పాండే, కోమల్ జంజాద్, అరుంధతి రెడ్డి, పూనమ్ యాదవ్, ఏక్తా బిస్త్, రాధా యాదవ్, వేద కృష్ణమూర్తి, హర్లీన్ డియోల్