భారత్-ఆస్ట్రేలియా టీ20 సిరీస్ కాసేపట్లో ప్రారంభం కానుంది. సాయంత్రం 7 గంటలకు విశాఖ పట్టణం వేదికగా జరిగే మొదటి టీ20కి సర్వం సిద్ధమైంది. ఇరు జట్లు ఎంతో కీలకంగా భావిస్తున్న ఈ సిరీస్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ప్రపంచకప్ ముంగిట తుది జట్లను సిద్ధం చేసుకోవడానికి ఈ సిరీస్ను ఉపయోగించుకోవాలని భారత్, ఆసీస్ భావిస్తున్నాయి. ఆసీస్ గడ్డపై సిరీస్ గెలిచిన భారత్ పై ప్రతీకారం తీర్చుకోవాలని కంగారూ జట్టు అనుకుంటోంది.
కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో పటిష్టంగా ఉంది..ఆసీస్ కూడా పొట్టి ఫార్మాట్లో ప్రమాదకర జట్టుతో బరిలోకి దిగుతోంది.
జట్లు
భారత్
కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, రిషబ్ పంత్, దినేష్ కార్తీక్, ధోనీ, కృనాల్ పాండ్యా, విజయ్ శంకర్, చాహల్, బూమ్రా, ఉమేష్ యాదవ్, సిద్ధార్థ్ కౌల్, మయాంక్ మార్కండే
ఆస్ట్రేలియా
ఆరోన్ ఫించ్ (కెప్టెన్), డీఆర్సీ షాట్, ప్యాట్ కమిన్స్, అలెక్స్ కారే, జాసన్ బెహ్రెన్ డాఫ్, నాథన్ కల్టర్ నీల్, పీటర్ హాండ్స్ కోంబ్, ఉస్మాన్ ఖవాజా, నాథన్ లియోన్, గ్లెన్ మ్యాక్స్ వెల్, జ్యే రిచర్డ్ సన్, కేన్ రిచర్డ్ సన్, మార్కస్ స్టోయినిస్, ఆష్టన్ టర్నర్, ఆడం జంపా.