ఆస్ట్రేలియాతో జరిగిన రెండు టీ20ల్లోనూ రాణించిన రాహుల్ టీ20 ర్యాంకింగ్స్‌లో వృద్ధి సాధించాడు. ఐసీసీ గురువారం ప్రకటించిన ర్యాంకుల్లో 726 పాయింట్లతో కెరీర్ బెస్ట్ 6వ స్థానం సాధించాడు. టాప్-10లో ఇతనొక్కడే భారత్ బ్యాట్స్‌మెన్. కెప్టెన్ కోహ్లి 17లో ఉండగా, ధోని 56వ స్థానంలో ఉన్నాడు. అగ్ర స్థానంలో పాక్ బ్యాట్స్‌మెన్ బాబర్ ఆజమ్ కొనసాగుతున్నాడు.
భారత్ బౌలర్లలో కుల్దీప్ 2 స్థానాలు దిగజారి 4కు పరిమితమయ్యాడు. బుమ్రా 15లో ఉండగా, కృనాల్ పాండ్య 18 స్థానాలు ఎగబాకి కెరీర్లో అత్యుత్తమంగా 43వ ర్యాంక్ సొంతం చేసుకున్నాడు.
భారత్‌పై చెలరేగి ఆడిన మ్యాక్స్‌వెల్ మూడు స్థానాలు మెరుగుపర్చుకుని 3వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. అఫ్గాన్ బ్యాట్స్‌మెన్ హజ్రతుల్లా 31 స్థానాలు ఎగబాకి 7వ స్థానం పొందాడు.
After his stunning 162* in Dehradun, @zazai_3 rockets 31 places into the top ten of the @MRFWorldwide men's T20I batting rankings! 👏https://t.co/1w0XsMaRs8
— ICC (@ICC) February 28, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">After his stunning 162* in Dehradun, @zazai_3 rockets 31 places into the top ten of the @MRFWorldwide men's T20I batting rankings! 👏https://t.co/1w0XsMaRs8
— ICC (@ICC) February 28, 2019After his stunning 162* in Dehradun, @zazai_3 rockets 31 places into the top ten of the @MRFWorldwide men's T20I batting rankings! 👏https://t.co/1w0XsMaRs8
— ICC (@ICC) February 28, 2019
టీం విభాగంలో భారత్ రెండో స్థానాన్ని తిరిగి సొంతం చేసుకుంది. టీట్వంటీ సిరీస్‌ను గెలిచిన ఆస్ట్రేలియా మూడులో కొనసాగుతుండగా.. టాప్‌లో పాకిస్థాన్ నిలిచింది.