ETV Bharat / cricket

ఐపీఎల్​ ఆరంభ వేడుక రద్దు

మార్చి 23 నుండి ప్రారంభంకానున్న ఐపీఎల్​లో ప్రారంభ వేడుకలు నిర్వహించకూడదని బీసీసీఐ పాలకమండలి నిర్ణయించింది. ​ఆ రోజు ఉత్సవానికి అయ్యే వ్యయాన్ని పుల్వామా అమరజవాన్ల కుటుంబాలకు అందజేయనున్నారు. తొలి మ్యాచ్​ 23వ తేదీన బెంగళూరు, చైన్నై జట్ల మధ్య జరగనుంది.

ఐపీఎల్​ ఆరంభ వేడుక రద్దు
author img

By

Published : Feb 22, 2019, 8:01 PM IST

అట్టహాసంగా నిర్వహించే ఐపీఎల్​ ప్రారంభ వేడుకకు భారీగా ఖర్చు చేస్తారు. బాలీవుడ్​ తారల డ్యాన్సులు , వెలుగులతో ఆతిథ్య స్టేడియం కళకళలాడుతుంది. కాని పుల్వామా ఉగ్రదాడిలో సీఆర్​పీఎఫ్​ జవాన్ల త్యాగానికి 12వ ఐపీఎల్​ ప్రారంభ కార్యక్రమాన్ని అంకితం చేస్తున్నారు.

'జవాన్లు దేశం కోసం మరణించినందుకు ఈ చిన్న త్యాగాన్ని చేస్తున్నాం. వేడుక వ్యయాన్ని బాధిత కుటుంబాలకు ఇస్తాం'.
-సీఓఏ ఛైర్మన్​, వినోద్​ రాయ్

శుక్రవారం భారత్​-పాక్​ ప్రపంచకప్​ మ్యాచ్ నిర్వహణపై చర్చ జరుగుతోంది. భాగంగా ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పాకిస్థాన్​తో క్రీడా సత్సంబంధాలను తెంచేసుకోవాలని ప్రజలు, ప్రముఖుల నుంచి సూచనలు వస్తున్నాయి.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.