దిల్లీలో జరిగిన మారథాన్‌ను క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ ప్రారంభించారు. ఈ మారథాన్‌లో వేలాది మంది పాల్గొన్నారు. సచిన్ సైతం పరుగెత్తారు. పుషప్స్ చేశారు.
పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు సాయం చేసేందుకు ఐడీబీఐ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆధ్వర్యంలో ఈ మారథాన్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా రూ.15 లక్షలు పొగుచేశారు.
- ఆరోగ్య పరిరక్షణ కోసం #కీప్ మూవింగ్ పుష్ అప్ ఛాలెంజ్‌లో భాగంగా రన్నర్స్‌తో పాటు సచిన్ పది పుష్ అప్స్ తీశాడు.
"ఇక్కడ జమచేసిన మొత్తం ఒక మంచి పని కోసం ఉపయోగిస్తున్నాం. డబ్బును వీరజవాన్ల కుటుంబాలకు అందజేస్తాం. పిల్లలు చాలా మంది పాల్గొనడం ఆనందాన్ని కలిగించింది. భావి తరాలకు వారసులు వీరే. అందరూ క్రీడల్లో పాల్గొంటూ దేశాన్ని ఆరోగ్యంగా ఉంచాలి"--సచిన్ తెందూల్కర్
ఫుల్ మారథాన్(42.195 కి.మీ), హాఫ్ మారథాన్(21.095 కి.మీ), 10కె రన్, 5కె స్వచ్ఛభారత్ రన్..ఇలా మొత్తం నాలుగు రకాలు పోటీలు జరిగాయి.