స్వదేశంలో ఆస్టేలియాతో ఈనెల 24 నుంచి జరగనున్న రెండు టీ20లు, ఐదు వన్డేలకు బీసీసీఐ మూడు జట్లను ప్రకటించింది. టీ-20 సిరీస్‌కు ఒక జట్టు. మొదటి 2 వన్డేలకు ఒకటి, చివరి మూడు వన్డేలకు ఒక జట్టుని ఎంపిక చేశారు. విశాఖలో టీ20 మ్యాచ్‌తో ఆసిస్‌తో పోరు ప్రారంభం కానుంది.
- రాహుల్ పునరాగమనం:
వివాదం కారణంగా న్యూజిలాండ్ పర్యటనకు దూరమైన కేఎల్ రాహుల్‌కు కూడా ఈ జట్టులో స్థానం లభించింది. ఇటీవల భారత్ ‘ఎ’ తరఫున రాహుల్ రెండు అర్ధ సెంచరీలతో ఫామ్‌ను చాటుకున్నాడు. దీంతో మూడో ఓపెనర్‌గా ఉపయోగపడతాడని సెలక్షన్ కమిటీ రాహుల్‌పై భరోసా ఉంచింది.
- పంత్ వచ్చాడు...కార్తీక్ వెళ్లాడు:
ధోనీకి రిజర్వ్ కీపర్‌గా సీనియర్ దినేశ్ కార్తీక్‌తో తీవ్ర పోటీ ఎదుర్కొన్నాడు యువ ఆటగాడు రిషబ్ పంత్. చివరికి ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకొని మ్యాచ్‌ను ముగించగల సత్తా పంత్‌కు ఉందని సెలెక్టర్లు నమ్మకముంచారు. దీంతో అతడి ప్రపంచకప్ కల నెరవేరనుంది. మిడిలార్డర్‌లో ఒక ఎడంచేతి వాటం బ్యాట్స్‌మన్ ఉండాలని సెలక్టర్లు భావించడం అతడికి అదనపు బలం.
- టీ20లకే దినేశ్ కార్తీక్‌ను పరిమితం చేశారు. వన్డే జట్టులో ఉన్నవాళ్లే ఎక్కువ శాతం ప్రపంచకప్ తుది జట్టులో ఉంటారనే ఊహాగానాల వల్ల ఇతడి పరిస్థితి అయోమయంగా మారింది.
- ఐపీఎల్‌తో ఫేం:
- టీ20ల్లో పంజాబ్ స్పిన్నర్ మయాంక్ మార్కండేకు అవకాశం ఇచ్చారు. ఈ 21 ఏళ్ల స్పిన్నర్ తొలిసారిగా జాతీయ జట్టులో చోటు కల్పించారు.
ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన ఈ లెగ్ స్పిన్నర్ ప్రత్యేక గుర్తింపు సాధించాడు. 2018 ఐపీఎల్‌లో 14 మ్యాచ్‌లు ఆడి... 8.36 ఎకానమీతో 15 వికెట్లు పడగొట్టాడు.
- కొత్తముఖాలకు చోటు:
- ఆల్‌రౌండర్ విజయ్ శంకర్‌కు కూడా అదృష్టం కలిసొచ్చింది. కొన్నాళ్ల క్రితం వరకు ఇతడి పేరు కూడా వినపడేది కాదు...ఇటీవల విజయ్ నిలకడైన ప్రదర్శనపై సెలక్టర్లు నమ్మకం ఉంచారు.
-నాలుగో పేసర్‌గా పంజాబ్ సీమర్ సిద్ధార్థ్ కౌల్‌ను రెండు టీ20లు, రెండు వన్డేలకు తీసుకున్నారు.
-పేసర్ ఉమేశ్ యాదవ్‌కు టీ20ల్లో చోటు దక్కింది.
-భువనేశ్వర్‌ను మాత్రం చివరి మూడు వన్డేల్లో మాత్రమే ఆడించనున్నారు.
- వన్డేల్లో అవకాశం:
టీ20 సిరీస్‌లో కుల్దీప్ యాదవ్‌కు విశ్రాంతినిచ్చారు. వన్డేల్లో తిరిగి జట్టులో కొనసాగనున్నాడు.
- పక్కనపెట్టేశారు:
- ఇటీవల ఐపీఎల్‌లో భారీ ధరకు పలికిన ఉనద్కత్‌కు నిరాశే ఎదురైంది.
-పేలవ ప్రదర్శనతో ఎడమచేతి పేసర్ ఖలీల్ అహ్మద్ జట్టులో చోటు కోల్పోయాడు.
- ఆస్ట్రేలియాతో వన్డేలు ఆడిన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను పరిగణనలోకి తీసుకోలేదు.
- ఏదో ఒక మూల ఆశలు పెంచుకున్న రహానేను పూర్తిగా పక్కనపెట్టేశారు.
- భారత జట్లు:
టీ20లకు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, రాహుల్, రిషబ్ పంత్, దినేశ్ కార్తిక్, ఎంఎస్ ధోనీ, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, విజయ్ శంకర్, చాహాల్, బుమ్రా, ఉమేశ్ యాదవ్, సిద్ధార్థ్ కౌల్, మయాంక్ మార్కండే.
తొలి రెండు వన్డేలకు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్, ధావన్, అంబటి రాయుడు, కేదార్ జాదవ్, ధోనీ, హార్దిక్ పాండ్య, విజయ్ శంకర్, రాహుల్, పంత్, బుమ్రా, షమీ, చాహాల్, కుల్దీప్ యాదవ్, సిద్ధార్థ్ కౌల్.
చివరి మూడు వన్డేలకు: విరాట్ ేకోహ్లీ (కెప్టెన్), రోహిత్, ధావన్, అంబటి రాయుడు, కేదార్ జాదవ్, ధోనీ, హార్దిక్ పాండ్యా, విజయ్ శంకర్, రాహుల్, పంత్, బుమ్రా, షమీ, చాహాల్, కుల్దీప్, భువనే శ్వర్
" class="align-text-top noRightClick twitterSection" data="దినేశ్ కార్తీక్‌కు దారులు మూసుకుపోలేదు. దీనికి ముందు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సిరీస్‌లలో అతడిని ఆడించాం. ఆ సమయంలో పంత్‌కు విశ్రాంతినిచ్చాం. ఆ తర్వాత ఇంగ్లండ్ లయన్స్‌పై పంత్ బాగా ఆడాడు. అందుకే టీ20 సిరీస్‌కు పంపించాం. వరల్డ్ కప్‌పై తుది నిర్ణయం తీసుకునే ముందు పంత్‌ను అందుకే కొన్ని వన్డేలు ఆడించాలని భావిస్తున్నాం. ఇటీవల కివీస్‌తో విజయ్ శంకర్ బాగా ఆడటంతో మా కూర్పు మార్చుకోవాల్సి వచ్చింది. అతను ఎంతో ప్రభావవంతమైన ఆటగాడు. తర్వాతి మ్యాచ్‌లు ఎలా ఆడతాడో చూస్తాం. మెగా టోర్నీకి ముందు అందరినీ పరీక్షించాలనేదే మా ప్రయత్నం. మరోవైపు వరల్డ్ కప్ కోసం 18 మందిని షార్ట్ లిస్ట్ చేశాం. వీరికి తగినంత విశ్రాంతినిస్తూ మ్యాచ్‌లు ఆడించే అంశంపై ఐపీఎల్ ఫ్రాంచైజీలతో చర్చించబోతున్నాం.
– ఎమ్మెస్కే ప్రసాద్, సెలక్షన్ కమిటీ ఛైర్మన్
"We want to give enough chances to Pant before the World Cup" - MSK Prasad #TeamIndia #INDvAUS pic.twitter.com/o13jma3yuE
— BCCI (@BCCI) February 15, 2019
">"We want to give enough chances to Pant before the World Cup" - MSK Prasad #TeamIndia #INDvAUS pic.twitter.com/o13jma3yuE
— BCCI (@BCCI) February 15, 2019
"We want to give enough chances to Pant before the World Cup" - MSK Prasad #TeamIndia #INDvAUS pic.twitter.com/o13jma3yuE
— BCCI (@BCCI) February 15, 2019