ప్రస్తుతం జాతీయ జట్టుకు దూరమైన భారత్ బ్యాట్స్‌మెన్ సురేశ్ రైనా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అరుదైన ఘనత సాధించాడు. పుదుచ్చేరితో జరిగిన మ్యాచ్‌లో 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద టీట్వంటీల్లో 8000 పరుగులు సాధించిన తొలి భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.
పొట్టి ఫార్మాట్లో 300 టీ- 20 మ్యాచ్‌లాడిన ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ 33.47 సగటుతో 8001 రన్స్ చేశాడు. ఇందులో 48 అర్ధ సెంచరీలున్నాయి.
ధోని తర్వాత 300 టీ-20 మ్యాచ్‌లు ఆడిన భారత్ క్రికెటర్ రైనా కావడం విశేషం. 299 మ్యాచ్‌లతో రోహిత్ మూడో స్థానంలో ఉన్నాడు.
టీ-20ల్లో విరాట్ కోహ్లీ-7833 పరుగులు, రోహిత్ శర్మ-7795 పరుగులు చేశారు.
మొదటి ఐదు స్థానాల్లో..
1 | క్రిస్ గేల్ | 12,298 పరుగులు |
2 | బ్రెండన్ మెక్కల్లమ్ | 9922 పరుగులు |
3 | కీరన్ పొలార్డ్ | 8838 పరుగులు |
4 | షోయబ్ మాలిక్ | 8603 పరుగులు |
5 | డేవిడ్ వార్నర్ | 8111 పరుగులు |