బీసీసీఐ పాలకమండలి అధ్యక్షుడు వినోద్ రాయ్, సభ్యురాలు డయానా ఎడుల్జీ తీరుపై భారత అత్యున్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. విబేధాలపై ప్రజలు చర్చించుకునేలా వ్యవహరించొద్దని ఆదేశించింది.
- జస్టిస్ ఏస్ఏ బాబ్డే, జస్టిస్ ఏఎమ్ సప్రేలతో కూడిన ఇద్దరు సభ్యుల ధర్మాసనం ఈ విషయంపై చర్చించారు. సీఓఏలో మరో ముగ్గురు సభ్యులను చేర్చనున్నట్లూ వెల్లడించారు.
'సీఓఏ సభ్యుల మధ్య వివాదం నడుస్తోందని చాలా పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. అంతర్గత విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లొద్దు. అది ఎంత మాత్రం బీసీసీఐ పరువు,ప్రతిష్ఠకు మంచిది కాదు' అంటూ అత్యున్నత న్యాయస్థానం హెచ్చరించింది.
గతంలో చిన్న కారణాలతో చరిత్రకారుడు రామచంద్ర గుహ, ఆర్థికవేత్త విక్రమ్ లిమయే రాజీనామాలతో సీఓఏలో వీరిద్దరే మిగిలారు.
- ఇది చూడండి---> మే నెలలో జరగనున్నప్రపంచకప్పై నీలి నీడలు కమ్ముకుంటున్నాాాయా..?