పుల్వామా దాడి తర్వాత అందరూ క్రికెట్ మ్యాచ్‌ను లక్ష్యం చేసుకోవడం చాలా బాధాకరమని పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపాడు. క్రికెట్ ప్రేక్షకులకు ఎంతో ఆసక్తికరమైన భారత్-పాక్ మ్యాచ్ జరగాలని ఆశాభావం వ్యక్తం చేశాడు.
"కొన్ని కోట్ల మంది చూసే మ్యాచ్‌ను బహిష్కరించడం మంచిది కాదు. పుల్వామా దాడి తర్వాత రాజకీయాల కోసం క్రికెట్‌ను ప్రభావితం చేస్తున్నారు. రాజకీయాలను, క్రీడలను వేర్వేరుగా చూడాలి".
-సర్ఫరాజ్ అహ్మద్, పాకిస్థాన్ క్రికెటర్
ప్రపంచ కప్‌లో భారత్-పాక్ మ్యాచ్ బహిష్కరించాలని హర్భజన్ సింగ్, గంగూలీ లాంటి వారు కోరుతుంటే... సచిన్, గవాస్కర్ మాత్రం రద్దు వల్ల భారత్‌కే నష్టం జరుగుతుందని అంటున్నారు. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ మియాందాద్ కూడా మ్యాచ్‌కు ఆటంకాలు సృష్టించడం సరికాదని తెలిపాడు.
దక్షిణాఫ్రికా క్రికెటర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సర్ఫరాజ్ అహ్మద్‌పై ఐసీసీ ఏడాది సస్పెన్షన్ విధించిన సంగతి తెలిసిందే. మార్చితో ఆ గడువు ముగియనుంది.