పాకిస్థాన్ టీ-ట్వంటీ లీగ్ ప్రసారహక్కుల నుంచి ఐఎంజీ- రిలయన్స్ వైదొలిగింది. పుల్వామా దాడి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ వసీం ఖాన్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరుగుతున్న పాకిస్థాన్ సూపర్ లీగ్ ప్రసారానికి రిలయన్స్ గ్రూప్‌తో పీసీబీకి ఒప్పందం ఉంది. ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు రిలయన్స్ తెలిపింది. త్వరలోనే మరో ప్రసారదారును ఎంపిక చేస్తామని పీసీబీ ప్రకటించింది.
క్రీడలను, రాజకీయాలను వేర్వేరుగా చూడాలని.. ఈ విషయాన్ని వచ్చే నెల దుబాయ్‌లో జరిగే ఐసీసీ సమావేశంలో అందరి దృష్టికి తీసుకెళతామని ఖాన్ తెలిపారు.