అఫ్గానిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20ల్లో ‘హ్యాట్రిక్’ వికెట్లు తీసిన తొలి స్పిన్నర్‌గా రషీద్ రికార్డు నెలకొల్పాడు. ఆదివారం దేహ్రాదూన్‌లో అఫ్గాన్-ఐర్లాండ్ మధ్య జరిగిన మూడో టీ20లో ఈ ఘనత సాధించాడు. వరుసగా 4 బంతుల్లో నాలుగు వికెట్లు తీసి ‘హ్యాట్రిక్’ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.
అఫ్గాన్ బౌలింగ్‌లో 16వ ఓవర్ వేసిన రషీద్ చివరి బంతికి కెవిన్ ఓబ్రియన్ (47 బంతుల్లో 74; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) పోరాటానికి అడ్డుకట్ట వేశాడు. అనంతరం 18వ ఓవర్‌లో వరుస మూడు బంతులకు డాక్రెల్ (18), గెట్‌కెట్ (2), సిమి సింగ్ (0)లను పెవిలియన్‌కు చేర్చాడు. వరుసగా మూడు మ్యాచుల్లోనూ విజయం సాధించిన అఫ్గాన్ జట్టు సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది.
రషీద్ రికార్డులు ఇవే...
⦁ అంతర్జాతీయ టి20ల్లో ‘హ్యాట్రిక్’ వికెట్లు తీసిన తొలి స్పిన్నర్‌గా రషీద్‌ఖాన్ నిలిచాడు. ఓవరాల్‌గా ఏడో బౌలర్. గతంలో టీ20ల్లో ‘హ్యాట్రిక్’ నమోదు చేసిన ఆరుగురూ పేస్ బౌలర్లే (బ్రెట్ లీ, జాకబ్ ఓరమ్, టిమ్ సౌతీ,తిసారా పెరీరా, లసిత్ మలింగ, ఫహీమ్ అష్రఫ్).
⦁ అంతర్జాతీయ క్రికెట్‌లో వరుసగా 4 బంతుల్లో 4 వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా రషీద్ ఖాన్ గుర్తింపు పొందాడు. గతంలో శ్రీలంక పేసర్ లసిత్ మలింగ మాత్రమే (2007 వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాపై) ఈ ఘనత సాధించాడు.