పాకిస్థాన్ మాజీ క్రికెటర్ల ఫోటోలను తొలగించడం చాలా బాధాకరమని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) మేనేజింగ్ డైరెక్టర్ వసీం ఖాన్ అన్నారు. క్రీడలను, రాజకీయాలను వేర్వేరుగా చూడాలని ఆయన కోరారు. వచ్చే నెల దుబాయ్లో జరిగే ఐసీసీ సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తామని చెప్పారు. .
"ప్రజలు, దేశాల మధ్య సాన్నిహిత్యం పెరగడానికి క్రికెట్ తోడ్పడుతుంది. క్రీడలను రాజకీయాలతో ముడిపెట్టడం సరికాదు. చరిత్రాత్మక మైదానాలు, భవనాల నుంచి పాకిస్థాన్ క్రికెటర్ల చిత్రాలు తొలగించడం బాధాకరం" అని ఖాన్ తెలిపారు.
ఇప్పటికే ముంబయిలోని క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా భవనంలో ఇమ్రాన్ ఖాన్ చిత్రానికి తెరను కప్పగా, పంజాబ్లోని మొహాలీ స్టేడియంలో ఉన్న పాకిస్థాన్ క్రికెటర్ల చిత్రాలను తొలగించారు.