ETV Bharat / cricket

ఆస్ట్రేలియా సిరీస్​కు పాండ్యా దూరం - హార్ధిక్ స్థానంలో రవీంద్ర జడేజా

ఆస్ట్రేలియా సిరీస్​కు వెన్నునొప్పి కారణంగా దూరమైన పాండ్యా స్థానంలో రవీంద్ర జడేజాను ఎంపిక చేసింది బీసీసీఐ.

హార్ధిక్ పాండ్య
author img

By

Published : Feb 22, 2019, 7:34 AM IST

భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగబోయే టీ 20, వన్డే సిరీస్​కు ఆల్​రౌండర్ హార్ధిక్ పాండ్యా దూరమయ్యాడు. వెన్నునొప్పి కారణంగా సిరీస్​ నుంచి తప్పించినట్టు బీసీసీఐ ప్రకటించింది. హార్ధిక్ స్థానంలో రవీంద్ర జడేజాను జట్టులోకి తీసుకోనున్నారు.

  • వెన్నునొప్పితో బాధపడుతున్న పాండ్యాను బీసీసీఐ వైద్యబృందం పరీక్షించింది. హార్ధిక్ ఇంకా కోలుకోలేదని, విశ్రాంతి అవసరమని సూచించింది. ఆస్ట్రేలియాతో జరగనున్న టీ 20, వన్డేలకు 14 మందితో కూడిన జట్టును ప్రకటించింది సెలెక్షన్ కమిటీ. ఈ మ్యాచ్​లలో పాండ్యా స్థానంలో జడేజాను ఎంపిక చేసింది.

భారత పర్యటనలో ఉన్న ఆసీస్ రెండు టీ 20లు, 5 వన్డేలు ఆడనుంది. ఫిబ్రవరి 24న విశాఖలో తొలి టీ 20 ప్రారంభం కానుంది. గత నెలలో వివాదస్పద వ్యాఖ్యలతో సస్పెన్షన్​కు గురయ్యాడు పాండ్యా. సుప్రీంకోర్టు ఆదేశంతో జట్టులోకి వచ్చిన ఈ ఆల్​రౌండర్ న్యూజిలాండ్ పర్యటనలో ఆకట్టుకున్నాడు.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.