పుల్వామా దాడి అనంతరం పాకిస్థాన్‌పై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. వీరజవాన్ల కుటుంబాలకు సంతాపంగా మొహాలీ స్టేడియంలో ఉన్న 15 మంది పాక్ క్రికెటర్ల ఫోటోలను పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ తొలగించింది.
"పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ అధికారులందరం సమావేశమయ్యాం. దాడిలో మరణించిన జవాన్ల కుటుంబాలకు బాసటగా నిలవాలనుకున్నాం. ప్రతిగా ఈ నిర్ణయం తీసుకున్నాం."-అజయ్ త్యాగి, అసోసియేషన్ కోశాధికారి.
తొలగించిన చిత్రపటాల్లో ప్రస్తుత పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, షాహిద్ అఫ్రిది, జావేద్ మియాందాద్, వసీం అక్రమ్వి ఉన్నాయి.
2011 ప్రపంచకప్‌లో ఇదే స్టేడియంలో ఇండియా-పాక్ మధ్య సెమీఫైనల్ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో 29 పరుగుల తేడాతో టీమిండియా విజేతగా నిలిచింది.