విదేశాంగ మంత్రిత్వ శాఖ, క్రీడా శాఖ, హోం శాఖ ఆదేశాలు పరిగణనలోకి తీసుకోనున్నట్లు సీఓఏ సభ్యురాలు డయానాస్పష్టం చేశారు. దీనిపై శుక్రవారం స్పష్టత రానుంది.
- భారత్‌కే నష్టమా..!
ప్రపంచకప్‌లో పాక్‌తో మ్యాచ్ రద్దు చేసే ఆలోచనను ఐసీసీకి చెప్తే తిరస్కరణ ఎదుర్కోవలసి వస్తుంది. ఐసీసీ రాజ్యాంగం ప్రకారం కౌన్సిల్ ఏర్పాటు చేసిన ఈవెంట్లలో నిర్దేశించిన అన్ని జట్లు ఆడాల్సిందే. ఒకవేళ ఐసీసీ ఈ ప్రతిపాదనను తీవ్రంగా పరిగణిస్తే టీమిండియాకే నష్టం కలుగుతుంది.
- 2021లో ఛాంపియన్స్ ట్రోఫీని, 2023 ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇచ్చే అవకాశాన్ని కోల్పోవాల్సి వస్తుంది. ఇదే విషయమై శుక్రవారం పాలకుల కమిటీ ఛైర్మన్ వినోద్ రాయ్, డయానా ఎడుల్జీ సమావేశమవుతారు. జూన్ 16న భారత్-పాక్ మ్యాచ్ ఆడటంపై శుక్రవారం స్పష్టత వస్తుంది.
నేను భారత్, పాక్ మధ్య మ్యాచ్ గురించే ఆలోచిస్తున్నా. ఎలాంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుందో వేచి చూడాలి- వీవీఎస్ లక్ష్మణ్
పాకిస్థాన్‌తో టీమిండియా ఏ టోర్నీలోనూ ఆడకూడదు. నేను హర్భజన్‌తో ఏకీభవిస్తున్నాను. దేశ ప్రజల మనోభావాల కంటే ప్రపంచ కప్ ఎక్కువకాదు. మన జవాన్ల కుటుంబాలను చూసి మనం ఇక్కడ కన్నీరు పెడుతుంటే పాకిస్థాన్ కనీసం జాలి కూడా చూపించడం లేదు. అలాంటి దేశ జట్టుకు మనతో ఆడే అర్హత లేదు. మనం ఇక్కడ క్రికెట్ మ్యాచ్ గెలిస్తే జవాన్లు అక్కడ సంబరాలు చేసుకుంటారు. క్రికెట్‌కు వాళ్లు అంత గౌరవం ఇస్తున్నప్పుడు మనం దాన్ని కాపాడుకోవాలి. ఇండియా-పాక్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరగకపోతే ఇంకెక్కడా ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్‌లు ఉండకూడదు. ఐసీసీ, బీసీసీఐ ఈవిషయంపై నిర్ణయం తీసుకోవాలి.
- మాజీ కెప్టెన్ అజహరుద్దీన్