ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరుగుతుందా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈరోజు దిల్లీలో జరిగిన బీసీసీఐ పాలకమండలి సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సీఓఏ ఛైర్మన్ వినోద్ రాయ్ తెలిపారు.
"ప్రపంచకప్ మ్యాచ్‌లకు ఇంకా సమయం ఉన్నందున ఇప్పుడే ఏం చెప్పలేం. మ్యాచ్‌పై ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నాం. మేం ఐసీసీకి రెండు విషయాలు చెప్పదల్చుకున్నాం. ప్రపంచ కప్ మ్యాచ్‌లకు భద్రత పెంచాలి, తీవ్రవాదంతో ముడిపడిన దేశాలకు దూరంగా ఉండాలి అన్న విషయాలపై ఐసీసీతో చర్చిస్తాం".
-వినోద్ రాయ్, సీఓఏ ఛైర్మన్
ఇప్పటికే భారత్, పాక్ మ్యాచ్‌పై పలువురు భిన్న వాదనలు వినిపిస్తున్నారు. కొందరు మ్యాచ్‌ను బహిష్కరించాలని కోరుతుండగా, మరికొందరు మ్యాచ్ రద్దు కావడం వల్ల భారత్‌కే నష్టమని చెబుతున్నారు. మరి ఈ విషయమై బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
ఇవీ చదవండి..బీసీసీఐకి సుప్రీం చురకలు