వైజాగ్ టీ20లో ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నామన్నాడు ఆల్రౌండర్ కృనాల్ పాండ్యా. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడంలో చాలా శ్రమించాం. గెలుస్తామన్న దశలో ఓడిపోవడం బాధ కలిగించిందన్నాడు.
తదుపరి మ్యాచ్లో బ్యాటింగ్లో పుంజుకుంటామన్న ఆశాభావం వ్యక్తం చేసిన కృనాల్.. బౌలింగ్ విభాగం బాగుందన్నాడు. 0-1 తేడాతో వెనుకబడి ఉన్న తాము రెండో టీ20లో మంచి ప్రదర్శన కనబరుస్తామని స్పష్టం చేశాడు.
బ్యాటింగ్ లైనప్లో ముందు వచ్చే అవకాశాలేమైనా ఉన్నాయా అన్న ప్రశ్నకు.. ప్రస్తుతం దాని గురించి ఆలోచించడం లేదని.. పరిస్థితికి తగిన విధంగా ఆడటమే ముఖ్యమని తెలిపాడు. బ్యాట్, బంతి రెండింటితో జట్టుకు ఉపయోగపడటమే ప్రధానమని పేర్కొన్నాడు కృనాల్.
విశాఖ టీ20లో ఆసీస్ ఆటతీరును మెచ్చుకున్న కృనాల్... వారు ఎక్కడైనా 100 శాతం గెలుపు కోసం ప్రయత్నిస్తారన్నాడు. ప్రపంచకప్లో చోటు లభిస్తుందో లేదు తెలియదు.. ప్రస్తుతం నా దృష్టంతా రెండో టీ20 పైనే ఉందని తెలిపాడు.