విశాఖపట్టణంలో జరిగిన తొలి టీ20లో భారత్ ఓటమిపై విరాట్ స్పందించాడు. బ్యాటింగ్లో తాము మెరుగవ్వాల్సిన అవసరం ఉందని తెలిపాడు. ప్రపంచకప్ సమీపిస్తున్న దృష్ట్యా పంత్, రాహుల్కు మరిన్ని అవకాశాలు ఇవ్వడం మంచిదన్న అభిప్రాయం వ్యక్తం చేశాడు.
"150 పరుగులు చేస్తే మ్యాచ్ గెలిచేవాళ్లం. రాహుల్ అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. ఆసీస్ మాకంటే మెరుగైన ప్రదర్శన చేసింది. ఈ విజయానికి వారు అర్హులు. 127 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునేందుకు మా బౌలర్లు శ్రమించారు. వారి ప్రదర్శన అద్భుతం".
విరాట్ కోహ్లీ, కెప్టెన్