త్వరలో జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో పాక్‌తో భారత్ ఆడాలా?.... వద్దా? అని నిర్ణయించేది కేంద్ర ప్రభుత్వమేనని భారత మాజీ క్రికెటర్ కపిల్‌దేవ్ అన్నారు. ఈ అంశంపై మనమధ్య చర్చ అనవసరమని పేర్కొన్నారు. శుక్రవారం పుణెలో జరిగిన ఓ కార్యక్రమానికి ఆయన హజరయ్యారు.
పాక్‌తో ఆడేది... లేనిది... మనం నిర్ణయించాల్సింది కాదు. ప్రభుత్వం ఆ పని చేస్తుంది. వీటిపై మనం దృష్టి తగ్గించి... బాధితులకు చేయూతనందించాలి.
-- కపిల్
పుల్వామా ఉగ్రదాడి తర్వాత దేశవ్యాప్తంగా పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచకప్‌లో భారత్- పాక్ మధ్య మ్యాచ్ జరగుతుందా.. లేదా.. అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఇది కూడా చదవండి: